Vastu Tips : ఇంట్లో గొడవలతో మనశ్శాంతి కోల్పోతున్నారా..అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి

మీరు మీ ఇంట్లో ప్రతిరోజూ తగాదాలు, గొడవలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఖచ్చితంగా మీ ఇంట్లో వాస్తు దోషం ఉండే ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లోని కష్టాలు దూరమై, మనశ్శాంతి దగ్గరవుతుంది. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నెలకొనాలంటే ఈ వాస్తు చిట్కాలు ఫాలో అవ్వండి.

Vastu Tips : ఇంట్లో గొడవలతో మనశ్శాంతి కోల్పోతున్నారా..అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి
Vastu Tips
Follow us
Madhavi

| Edited By: Ravi Kiran

Updated on: Apr 03, 2023 | 9:48 AM

మీరు మీ ఇంట్లో ప్రతిరోజూ తగాదాలు, గొడవలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఖచ్చితంగా మీ ఇంట్లో వాస్తు దోషం ఉండే ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లోని కష్టాలు దూరమై, మనశ్శాంతి దగ్గరవుతుంది. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నెలకొనాలంటే ఈ వాస్తు చిట్కాలు ఫాలో అవ్వండి.

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో ఉంచిన ప్రతిదాని వస్తువుకు శక్తి ఉంటుంది. ఇవి ఇంటి సభ్యులను సానుకూల, ప్రతికూల మార్గాల్లో ప్రభావితం చేస్తాయి. మనం చేసే కొన్ని తప్పుల వల్ల ఇంట్లో వాస్తు దోషం పెరుగుతుంది. ఈ వాస్తు దోషం వల్ల ఇంట్లో ఎప్పుడూ గొడవలు, ఆర్థిక సమస్యలు తలెత్తతుంటాయి. వాస్తు దోషం వల్ల ఇంట్లో కొట్లాటలు, గొడవలతోపాటు కుటుంబ సభ్యుల్లో ఒకరు అనారోగ్యం పాలవుతుంటారు. వాస్తు ప్రకారం కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల ఇంట్లోని కష్టాలు తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుంది. వాస్తుకు సంబంధించిన ఈ చర్యల గురించి తెలుసుకుందాం.

– వాస్తు దోషాల సమస్యల నుండి బయటపడాలంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద కొన్ని చర్యలు తీసుకోవాలి. ఇంటి వాస్తు సరిగ్గా ఉండాలంటే ప్రతిరోజూ ఉదయాన్నే ఇంట్లో దీపం వెలిగించాలి. దీపంతోపాటు ధూపం వేయండి.

ఇవి కూడా చదవండి

– కొద్దిగా నీళ్లలో పసుపు కలిపి, ఈ నీటిని ఇంటి ప్రధాన ద్వారం మీద చల్లాలి. దీని తరువాత, తలుపుకు రెండు వైపులా శుభ్రమైన నీటితో ఉన్న నీటి కుండలను ఏర్పాటు చేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రసరిస్తుంది.

– ప్రధాన ద్వారం మీద పసుపు నీరు చల్లడం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అపరిశుభ్రత ఉన్న ఇంట్లోలక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదు. -ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుంటే రాత్రి పడుకునే ముందు ఇత్తడి పాత్రలో కర్పూరాన్ని కాల్చి ఇంట్లో ఆ పొగను మూలమూలాన ఉంచండి. కర్పూరం యొక్క ఈ పరిహారంతో, గృహ బాధలు నశిస్తాయి.ఇంట్లో శాంతి ఉంటుంది.

– భార్యాభర్తల మధ్య గొడవలుంటే రాత్రి పడుకునేటప్పుడు కర్పూరాన్ని దిండు కింద ఉంచి ఉదయాన్నే కాల్చాలి. దీని తరువాత, దాని బూడిద ప్రవహించే నీటిలో వేయండి. ఈ పరిహారం చేయడం వల్ల శాంతి నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది.

-ఇంట్లో అసమ్మతిని తొలగించడానికి, ఇంటి యజమాని రాగి చెట్టుకు పూజలు చేయాలి. ఇంటి దగ్గర రాగి మొక్కను నాటి దానిని నిరంతరం సంరక్షించాలి. దీని వల్ల ఇంటి సభ్యులపై దేవతల ఆశీస్సులు ఉండేలా చేస్తుంది.

మరిన్ని జ్యోతిష్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)