AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam: శ్రీశైలంలో 19న అమ్మవారి కుంభోత్సవం.. జంతుబలి నిషేధంపై ప్రచారం..

శ్రీశైలంలో ఈనెల 11న జరిగే కుంభోత్సవ ఏర్పాట్లపై ఆలయ ఈవో లవన్న సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.

Srisailam: శ్రీశైలంలో 19న అమ్మవారి కుంభోత్సవం.. జంతుబలి నిషేధంపై ప్రచారం..
Srisailam Temple
Sanjay Kasula
|

Updated on: Apr 02, 2023 | 9:48 PM

Share

శ్రీశైలంలో ఈనెల 11 న శ్రీభ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం జరగనుంది. ఈ కుంభోత్సవ ఏర్పాట్లపై స్థానిక రెవిన్యూ, పోలీస్, ఆర్టీసి అధికారులతో ఆలయ ఈవో సమన్వయ సమావేశం నిర్వహించారు. 11 న జరిగే కుంభోత్సవం రోజు అమ్మవారికి సాత్విక బలిగా గుమ్మడి, కొబ్బరి, నిమ్మకాయలు సమర్పిస్తామన్నారు. అలానే క్షేత్రంలో జీవహింస నిషిద్ధం కారణంగా జంతు, పక్షు బలులు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని దేవస్థానం అధికారులకు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. జంతుబలి నిషేధానికి పోలీస్, రెవెన్యూ సిబ్బంది కూడా తనిఖీ బృందాలు ఏర్పాటు చేయాలని కోరారు . దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది కూడా తనిఖీ కోసం ఏర్పాటు చేస్తామన్నారు.

ముందు రోజు రాత్రి నుంచే ఆలయ వీధులు,అంకాళమ్మ,పంచమఠాలు,మహిషాసురమర్ధిని ఆలయం వద్ద సిబ్బందికి గస్తీకి ప్రత్యేక విధులు కేటాయిస్తామన్నారు ఈవో లవన్న. జంతు బలులు జరగకుండా దేవస్థానం టోల్ గేట్ దగ్గర తనిఖీలు విస్తృతంగా చేయాలని రెవిన్యూ, పోలీస్ అధికారులకు సూచనలు చేశారు.

జంతుబలి నిషేధాన్ని భక్తులలో అవగాహన కోసం టెంపుల్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టమ్ ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు, కుంభోత్సవం రోజు సున్నిపెంటలో మద్యం దుకాణాలు కూడా నిలిపివేసేలా జిల్లా కలెక్టర్‌ని కోరతామన్నారు ఈవో. కుంభోత్సవానికి వస్తే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం