AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATM Currency: ఏటీఎంలలో చిరిగిపోయిన నోట్లు వస్తే ఏం చేయాలి..? అలాంటి నోట్లను మార్చుకోవడం ఎలా..?

ఏటీఎంల నుంచి డబ్బు విత్‌డ్రా చేస్తున్నప్పుడు డ్యామేజ్ అయితే నోట్‌లు తరచూ వస్తుంటాయి. అలాంటి సమయంలో కస్టమర్‌లు టెన్షణ్కు గురవుతుంటారు. చిరిగిపోయిన నోట్లు చెల్లవని, అవి ఎలా మార్చుకోవాలనే దానిపై ఆందోళన చెందుతుంటారు. నకిలీ నోట్లు, చిరిగిపోయిన నోట్లకు..

ATM Currency: ఏటీఎంలలో చిరిగిపోయిన నోట్లు వస్తే ఏం చేయాలి..? అలాంటి నోట్లను మార్చుకోవడం ఎలా..?
Atm Notes
Subhash Goud
|

Updated on: Apr 12, 2023 | 8:30 PM

Share

ఏటీఎంల నుంచి డబ్బు విత్‌డ్రా చేస్తున్నప్పుడు డ్యామేజ్ అయితే నోట్‌లు తరచూ వస్తుంటాయి. అలాంటి సమయంలో కస్టమర్‌లు టెన్షణ్కు గురవుతుంటారు. చిరిగిపోయిన నోట్లు చెల్లవని, అవి ఎలా మార్చుకోవాలనే దానిపై ఆందోళన చెందుతుంటారు. నకిలీ నోట్లు, చిరిగిపోయిన నోట్లకు ప్రత్యామ్నాయం ఏమిటి? అలాంటి నోట్లు మీ వద్ద ఉంటే ఎవ్వరు తీసుకోరు. అలాంటప్పుడు ఈ నోట్లను మార్చుకునే మార్గాలను సూచిస్తోంది సెంట్రల్‌ బ్యాంకు. అందుకు సులభమైన పరిష్కారం చూపిస్తోంది. మీకు ఏటీఎంలలో చిరిగిపోయినా, నకిలీ నోట్లు వచ్చినట్లయితే వాటిని బ్యాంకులు డిపాజిట్‌ చేసుకుని కొత్త నోట్లను తీసుకోవచ్చని ఆర్బీఐ చెబుతోంది. ఇందు కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. బ్యాంకు సిబ్బంది ఆ నోట్లను తీసుకుని మీకు మంచి నోట్లను అందజేస్తుంది.

అయితే ఏటీఎంల నుంచి చిరిగిన కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిబంధనలను రూపొందించింది. ఈ నియమం ప్రకారం.. చిరిగిన నోట్లు బ్యాంకు ఏటీఎం నుండి వచ్చినట్లయితే ఈ నోట్లను మార్చుకోవడానికి బ్యాంకు నిరాకరించదు. నోట్ల మార్పిడి ప్రక్రియ చాలా సులభం. జూలై 2016లో ఆర్‌బీఐ అటువంటి నోట్లను మార్చడానికి సర్క్యులర్ కూడా జారీ చేసింది. బ్యాంకు నోట్లను మార్చుకోవడానికి నిరాకరిస్తే ఆ బ్యాంకులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆర్బీఐ హెచ్చరిస్తోంది.

అలాంటి నోట్లను మార్చడంలో బ్యాంకులు అభ్యంతరం తెలిపితే బ్యాంకులపై ఆర్బీఐ చర్యలు తీసుకుంటుందని గుర్తించుకోవాలి. అలాంటి బ్యాంకుకు జరిమానా విధించవచ్చు. బ్యాంకు ఏటీఎం నుంచి చిరిగిన, చిరిగిన నోట్లు వస్తున్నాయంటే ఆ బాధ్యత బ్యాంకుపైనే ఉంటుంది. అలాంటి నోట్లను మార్చుకునే బాధ్యత బ్యాంకుదే. అందుకే ఏటీఎంలోనే నోట్లను డిపాజిట్ చేసేటప్పుడు వాటిని సరిచూసుకోవడం బ్యాంకు పని.

ఇవి కూడా చదవండి

నోటు సీరియల్ నంబర్, మహాత్మా గాంధీ వాటర్‌మార్క్, గవర్నర్ సంతకం వంటివి కనిపించకపోతే అది నకిలీ నోటు అని గుర్తించి నోటును మార్చుకోవాలి. నోట్స్ మార్చుకోవడానికి సదరు వ్యక్తి ఒక అప్లికేషన్ రాయాల్సి ఉంటుంది. మీరు తేదీ, సమయంతో పాటు ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసిన మొత్తం వివరాలను నమోదు చేయాలి. అలాగే ఏ నోటు చిరిగిపోయిందో, ఏటీఎం స్లిప్‌ను జత చేయాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
భార్యల చేత శాపానికి గురైన ముగ్గురు దేవుళ్లు.. శని, బ్రహ్మ, సూర్య
భార్యల చేత శాపానికి గురైన ముగ్గురు దేవుళ్లు.. శని, బ్రహ్మ, సూర్య
సిద్దిపేట అభివృద్ధిపై ఫ్లెక్సీల రగడ.. సీఎం రేవంత్ పర్యటన వేళ..
సిద్దిపేట అభివృద్ధిపై ఫ్లెక్సీల రగడ.. సీఎం రేవంత్ పర్యటన వేళ..
హైదరాబాద్‌ వేదికగా తానా అవార్డ్స్‌ ప్రదానోత్సవం
హైదరాబాద్‌ వేదికగా తానా అవార్డ్స్‌ ప్రదానోత్సవం
నా కంటె చిన్నవాడైనా ఆ హీరో చాలా గొప్పోడు.. ఇవ్వడమే తెలుసు కానీ..
నా కంటె చిన్నవాడైనా ఆ హీరో చాలా గొప్పోడు.. ఇవ్వడమే తెలుసు కానీ..
అద్భుతాల నిలయం తిరుమల శ్రీవారి ఆలయం.. ఒక్కో మండపం వెనుక ఇంతటి..
అద్భుతాల నిలయం తిరుమల శ్రీవారి ఆలయం.. ఒక్కో మండపం వెనుక ఇంతటి..
మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకుంటున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
ఈ ఐదు మొక్కలు ఇంట్లో ఉండే.. ఇంటి అందంతో పాటు ఆరోగ్యం
ఈ ఐదు మొక్కలు ఇంట్లో ఉండే.. ఇంటి అందంతో పాటు ఆరోగ్యం
IND vs NZ: టీమిండియాకు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.. అదేంటంటే..?
IND vs NZ: టీమిండియాకు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.. అదేంటంటే..?
దిండు కవర్ మాత్రమే ఉతుకుతున్నారా? మీరు చేస్తున్న పొరపాటు ఇదే
దిండు కవర్ మాత్రమే ఉతుకుతున్నారా? మీరు చేస్తున్న పొరపాటు ఇదే
ఎన్ని సార్లు ఉతికినా టీ మరకలు పోవట్లేదా? వీటితో చిటికెలో మాయం!
ఎన్ని సార్లు ఉతికినా టీ మరకలు పోవట్లేదా? వీటితో చిటికెలో మాయం!