UPI: ఇకపై యూపీఐ ట్రాన్సాక్షన్‌లకు ఈఎమ్‌ఐ ఆప్షన్‌.. బంపరాఫర్‌ ప్రకటించిన ఆ బ్యాంక్‌.

సాధారణంగా క్రెడిట్‌ ద్వారా చేసే ట్రాన్సాక్షన్స్‌ను ఈఎమ్‌ఐకి మార్చుకునే అవకాశం ఉంటుందనే విషయం తెలిసిందే. ఇక కొన్ని బ్యాంకులైతే డెబిట్ కార్డు ద్వారా కూడా ఈఎమ్‌ఐకి కన్వర్ట్ చేసుకునే వీలును కల్పిస్తుంటాయి. అయితే యూపీఐతో చేసిన పేమెంట్‌ను కూడా ఈఎమ్‌ఐకి మార్చుకునే...

UPI: ఇకపై యూపీఐ ట్రాన్సాక్షన్‌లకు ఈఎమ్‌ఐ ఆప్షన్‌.. బంపరాఫర్‌ ప్రకటించిన ఆ బ్యాంక్‌.
Upi Payments
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 11, 2023 | 9:53 PM

సాధారణంగా క్రెడిట్‌ ద్వారా చేసే ట్రాన్సాక్షన్స్‌ను ఈఎమ్‌ఐకి మార్చుకునే అవకాశం ఉంటుందనే విషయం తెలిసిందే. ఇక కొన్ని బ్యాంకులైతే డెబిట్ కార్డు ద్వారా కూడా ఈఎమ్‌ఐకి కన్వర్ట్ చేసుకునే వీలును కల్పిస్తుంటాయి. అయితే యూపీఐతో చేసిన పేమెంట్‌ను కూడా ఈఎమ్‌ఐకి మార్చుకునే వెసులుబాటు ఉంటే ఎలా ఉంటుంది.? యూపీఐ పేమెంట్‌ను ఈఎమ్‌ఐగా ఎలా మార్చుకోవచ్చనేగా మీ సందేహం. ప్రముఖ ప్రైవేటు రంగ బ్యాంక్‌ ఐసీఐసీఐ తమ కస్టమర్ల కోసం ఈ వెసులుబాటును కల్పించింది. ఐసీఐసీ బ్యాంక్‌ అందించే ‘పే లేటర్‌’ కస్టమర్స్‌కి ఈ సదుపాయాన్ని పొందొచ్చు.

యూపీఐ ద్వారా క్యూఆర్‌ కోడ్ స్కాన్‌ చేసిన ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తే సదరు మొత్తాన్ని ఈఎంఐ కింద మార్చుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్‌, ఫ్యాషన్, దుస్తులు, గృహోపకరణాలు వంటి వాటికి ఈ ఈఎమ్‌ఐ ఆప్షన్‌ వర్తిస్తుంది. అయితే ఈ కొనుగోలు మొత్తం కనీసం రూ. 10 వేలు ఉండాలి. రూ. 10 వేల కంటే ఎక్కువ మొత్తాలను ఈఎమ్‌ఐగా మార్చుకోవచ్చు. ఈ విషయమై ఐసీఐసీఐ బ్యాంక్‌ డిజిటల్‌ ఛానల్‌ అండ్‌ పార్టనర్‌షిప్‌ హెడ్‌ బిజిత్‌ భాస్కర్‌ మాట్లాడుతూ.. ‘ఐసీఐసీఐ అందించే బై నౌ పే లేటర్‌ సర్వీసులను ఇటీవల కాలంలో ఎక్కువ మంది వినియోగించుకుంటున్నారని గమనించి ఈఎంఐ సదుపాయాన్ని తీసుకొచ్చా’మని చెప్పుకొచ్చారు.

ఈ ఆప్షన్‌ ఎలా ఉపయోగించుకోవాలంటే..

* ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఐసీఐసీఐ ‘ఐమొబైల్‌’ యాప్‌ను ఓపెన్‌ చేయాలి.

* అనంతరం మీరు పేమెంట్ చేయాలనుకున్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి.

* రూ. 10 వేల కంటే ఎక్కువ అమౌంట్‌ ఉంటే ఈఎమ్‌ఐ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

* ఈఎమ్‌ఐ ఆప్షన్స్‌ను మూడు, ఆరు, తొమ్మిది నెలలుగా ఎంచుకోవచ్చు.

* అనంతరం పేమెంట్‌పై కన్ఫామ్‌ చేస్తే ట్రాన్సాక్షన్‌ పూర్తవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే