South Central Railway: దక్షిణ మధ్య రైల్వేకు భారీ షాక్‌.. రైలులో ఏసీ పనిచేయనందుకు జరిమానా విధించిన కోర్టు

దక్షిణ మధ్య రైల్వేకు కంజ్యూమర్‌ ఫోరం షాక్‌ ఇచ్చింది. విద్యుత్తు అంతరాయం కారణంగా రైలులో ఏసా పనిచేయనందుకు భారీ మొత్తంలో జరిమానా విధించింది. 3 ఏసీ కంపార్ట్‌మెంట్లలో గంటల తరబడి ఏసీలు, ఫ్యాన్లు పనిచేయలేదని కేవీఎస్ అప్పారావు అనే వినియోగదారుడు జిల్లా కంజ్యూమర్‌ ఫోరంలో ఫిర్యాదు చేశాడు. దీంతో సదరు వ్యక్తికి రూ.15,000 చెల్లించాలని దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌)ని జిల్లా వినియోగదారుల ఫోరం ఆదేశించింది. ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లేందుకు తన కుమార్తెతో కలిసి కేవీఎస్ అప్పారావు గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణించాడు. అయితే తాము..

South Central Railway: దక్షిణ మధ్య రైల్వేకు భారీ షాక్‌.. రైలులో ఏసీ పనిచేయనందుకు జరిమానా విధించిన కోర్టు
South Central Railway
Follow us

|

Updated on: Nov 20, 2023 | 1:35 PM

హైదరాబాద్‌, నవంబర్‌ 20: దక్షిణ మధ్య రైల్వేకు కంజ్యూమర్‌ ఫోరం షాక్‌ ఇచ్చింది. విద్యుత్తు అంతరాయం కారణంగా రైలులో ఏసా పనిచేయనందుకు భారీ మొత్తంలో జరిమానా విధించింది. 3 ఏసీ కంపార్ట్‌మెంట్లలో గంటల తరబడి ఏసీలు, ఫ్యాన్లు పనిచేయలేదని కేవీఎస్ అప్పారావు అనే వినియోగదారుడు జిల్లా కంజ్యూమర్‌ ఫోరంలో ఫిర్యాదు చేశాడు. దీంతో సదరు వ్యక్తికి రూ.15,000 చెల్లించాలని దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌)ని జిల్లా వినియోగదారుల ఫోరం ఆదేశించింది. ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లేందుకు తన కుమార్తెతో కలిసి కేవీఎస్ అప్పారావు గరీబ్‌రథ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణించాడు. అయితే తాము ప్రయాణించిన రోజున రాత్రి 8.40 గంటలకు రైలు బయలుదేరిందని, రాత్రి 10 గంటల ప్రాంతంలో రాత్రి భోజనం ముగించుకుని నిద్రపోయామని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తమ కంపార్ట్‌మెంట్‌లో ఏసీలు, ఫ్యాన్లు పనిచేయకపోవడంతో ఊపిరాడక అర్ధరాత్రి వరకు ఇబ్బంది పడినట్లు తెలిపాడు. ఈ సమస్యపై తొలుత ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)కి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాజమండ్రి చేరుకున్న తర్వాత టీటీఈ, ఇతర అధికారులు రైలులో విద్యుత్‌ లోపం వల్లే సమస్య వచ్చిందని, ఏలూరు స్టేషన్‌కు చేరుకున్న తర్వాత పరిష్కరిస్తామని తెలిపారన్నారు.

ఏలూరు స్టేషన్‌కు గంట ఆలస్యంగా 1.40 గంటలకు, విజయవాడ 2.30 గంటలకు రైలు చేరుకుందని, తమ ప్రయాణ సమయంలో వెంటిలేషన్ కూడా లేకపోవడంతో ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందని అప్పారావు తన ఫిర్యాదులో తెలిపారు. ఏప్రిల్ 6వ తేదీన విజయవాడ స్టేషన్ నుంచి ఉదయం 4.40 గంటల నుంచి కరెంటు వచ్చే వరకు రైలు కదలలేదన్నారు. తాను, తన కుమార్తెతో పాటు ఇతర ప్రయాణీకులు ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ రైల్వేకు లేఖ రాశానని, పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసినా స్పందన రాలేదన్నారు. రైలులో డీజిల్ జనరేటింగ్ (డీజీ) సెట్‌లు పనిచేయకపోవడం వల్ల ఏసీ ప్లాంట్లకు విద్యుత్ సరఫరా అందుబాటులో లేదని ఆర్టీఐ దాఖలు చేయడం ద్వారా తెలుసుకున్నానని అప్పారావు తెలిపారు. తమకు సీట్లు కేటాయించిన కంపార్ట్‌మెంట్‌లో ఏసీ, ఫ్యాన్లు పనిచేయకపోవడంపై తగిన పరిహారం చెల్లించాలని కోరుతూ ఆయన ఫిర్యాదులో డిమాండ్‌ చేశారు.

ఏసీ వైఫల్యం, ప్రయాణ సమయంలో జాప్యం, నిర్లక్ష్యం, సేవా లోపాన్ని స్పష్టంగా చూపిస్తుందని విచారణ సందర్భంగా.. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ – II స్పష్టం చేసింది. రైలు ప్రయాణంలో డ్రైవర్‌లకు డ్యాష్‌బోర్డ్ లైట్లు ముఖ్యమైనవి. ఈ లైట్లు సరిగ్గా పని చేయకపోతే ప్రమాదం సంభవించవచ్చు. పని చేయని డాష్‌బోర్డ్ లైట్లను పరిష్కరించడానికి, డిమ్మర్ స్విచ్‌ని తనిఖీ చేసి, అవసరమైతే నిపుణులతో బాగు చేయించాలి. సురక్షితమైన డ్రైవింగ్ కోసం డాష్‌బోర్డ్ లైట్లను నిర్వహించడం చాలా అవసర అని కోర్టు అభిప్రాయపడింది. విద్యుత్ సరఫరా కనెక్షన్లు లేకపోవడమే బోర్డులు పనిచేయకపోవడానికి కారణమని బీఎంటీసీ అధికారులు కోర్టుకు విన్నవించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ కేసులో ఫిర్యాదుదారుడికి నష్టపరిహారం కింద రూ.15 వేలు చెల్లించాలని, మరమ్మత్తులన్నింటినీ సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తూ కంజ్యూమర్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి

కాగా గుంతకల్లు, విజయవాడ డివిజన్లలో కారిడార్ బ్లాక్ కారణంగా పలు రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. బిట్రగుంట MGR చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్, తిరుపతి కాట్పాడి ప్యాసింజర్ స్పెషల్ పూర్తిగా రద్దు చేశారు. ఇక పాక్షికంగా రద్దు చేసిన విల్లుపురం తిరుపతి ఎక్స్‌ప్రెస్‌, పూణే కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్, హటియా SMVT బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెల్పింది. ఈ మార్పులు నవంబర్ 20 నుంచి 26 వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది.

మరిన్ని జాతీయ కథనాల కోసం క్లిక్‌ చేయండి.