Renuka Chowdhury: సీఎం పదవిని ఆశించడంలో తప్పు లేదు.. డీకే శివకుమార్‌లా త్యాగం చేసే గుణం ఉండాలి..
తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతూ ప్రచారంలో దూసుకెళ్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిని ఆశించడంలో తప్పు లేదంటూ రేణుకాచౌదరి వ్యాఖ్యానించారు.

తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతూ ప్రచారంలో దూసుకెళ్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిని ఆశించడంలో తప్పు లేదంటూ రేణుకాచౌదరి వ్యాఖ్యానించారు.. ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైనంత మెజారిటీ తప్పకుండా సాధిస్తామని, సీఎం ఎవరనేది గెలిచిన ఎమ్మెల్యేలు, అధిష్టానం నిర్ణయిస్తారని చెప్పారు. కర్నాటక ఎగ్జాంపుల్‌ని కూడా గుర్తు చేశారు. డీకే శివకుమార్‌లా పదవిని త్యాగం చేసే గుణం అందరిలో ఉండాలంటూ సూచించారు.
ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ గాలి వీస్తోంది.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే సీట్లను ఖచ్చితంగా గెలుస్తామంటూ రేణుకా చౌదరి పేర్కొన్నారు. ఏపీలో నేను పోటీ చేయాలని, ప్రచారం చేయాలని ఆహ్వానం ఉంది.. ఏపిలో నరకం అనుభవిస్తున్నారు.. విభజన జరిగినా సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. చంద్రబాబు అరెస్ట్ తీరు సరిగా లేదు..అంత అవసరమా.. అంటూ ప్రశ్నించారు. ఏపీ సీఎం ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకి అనేది అందరికీ తెలుసంటూ పేర్కొన్నారు. ఇక్కడ తెలుగుదేశం పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడం సంతోషకరమన్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఎఫెక్టు పడిందన్నారు.
వీడియో చూడండి..
తమ పార్టీలో ఎక్కువ మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉండే స్థాయికి ఎదగడం సంతోషకరమంటూ తెలిపారు. కేసీఆర్, చంద్రబాబు కాంగ్రెస్ లో ఎదిగి ముఖ్యమంత్రులు అయిన వారేనంటూ రేణుకా చౌదరి పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..