AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: మునుగోడు ఉప ఎన్నికపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఢిల్లీ లిక్కర్ స్కాంపై కూడా..

మునుగోడు శాసనసభ్యుడిగా రాజీనామా చేసినప్పటి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్న తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మరోసారి రాజగోపాలరెడ్డిపై హాట్ కామెంట్స్..

Telangana: మునుగోడు ఉప ఎన్నికపై గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఢిల్లీ లిక్కర్ స్కాంపై కూడా..
Gutha Sukender Reddy
Amarnadh Daneti
|

Updated on: Aug 24, 2022 | 3:21 PM

Share

Telangana: మునుగోడు శాసనసభ్యుడిగా రాజీనామా చేసినప్పటి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్న తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మరోసారి రాజగోపాలరెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు. ఉప ఎన్నిక జరిగితే మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునగడం ఖాయమన్నారు. తనతో పాటు తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా ముంచుతున్నాడని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా ఉండి ఎన్నికల ప్రచారానికి వెళ్లను అంటే అర్థం ఏమిటని ప్రశ్నించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎందుకు నమ్మాలని అడిగారు. మునుగోడులో టీఆర్ ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లోనూ టీఆర్ ఎస్ పార్టీనే గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఢిల్లీలో మద్యం విధానంలో అవకతవకల ఆరోపణపై గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. లిక్కర్ స్కామ్ లేదు ఏం లేదు.. కేవలం రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం అవతలి పార్టీ వాళ్లపై బురదజల్లేందుకే లిక్కర్ స్కాం పేరుతో డ్రామాలాడుతున్నారని ఘాటుగా స్పందించారు. ఢిల్లీ మద్యం పాలసీ తయారీలో అక్రమాలు జరిగాయంటూ సీబీఐ దర్యాప్తు చేస్తోంది.. ఇదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని బీజేపీ కొద్దిరోజులుగా ప్రచారం చేస్తోంది. సీఎం కేసీఆర్ ను అప్రతిష్టపాలు చేసేందుకే కవిత పేరును తీసుకొచ్చారని టీఆర్ ఎస్ నాయకులంతా బీజేపీ నాయకుల ప్రచారాన్ని ఖండిస్తూ వచ్చారు. కవిత కూడా ఈకేసులో తనకు ఎటువంటి సంబంధం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికి కవిత ప్రమేయంపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలంటూ విపక్ష కాంగ్రేస్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లిక్కర్ స్కాం అనేదే లేదంటూ వ్యాఖ్యానించడం గమనర్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్