Hyderabad: పల్లికాయల నుంచి నూనె తీసి అమ్మితే డబ్బే.. డబ్బు.. కట్ చేస్తే
ఒకరి నుంచి మరొకరు ఇలా చైన్‌సిస్టమ్‌లా అనేకమంది గ్రూపులుగా, కొన్ని యూనిట్లుగా జనజాగరణసమితి ట్రస్టులో లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. నాలుగైదు వారాలు డబ్బులు వచ్చి ఆ తర్వాత ఆగిపోయాయి. ఆఫీసుకు వెళ్తే ..

చూడటానికి చైన్‌సిస్టమ్‌లా అనిపించినా..ఇదో కొత్త రకం మోసం. 10వేలు పెట్టి కంపెనీలో జాయిన్ అవ్వాలి. అందులో మీకు 5వేల రూపాయల విలువైన 1 గ్రాము బంగారం ఇస్తారు. ఆ తర్వాత ప్రతి వారం 500 రూపాయలు ఇస్తారు. అంటే ఇందులో టీడీఎస్ టాక్స్ కోసం 10 శాతం తగ్గించి 450 రూపాయల చొప్పున 60 వారాలు కలిపి మొత్తం 27000 రూపాయలు వస్తాయని చెబుతారు. ఇలా కొత్తవారిని చేరిస్తే, మరిన్ని గిఫ్టులు ఇస్తారు. అంతేకాదు…పల్లి మిషన్ల నుంచి నూనె తీసి అమ్మితే కూడా బోలెడు లాభాలు వస్తాయని కాస్తా యాక్టివ్‌గా ఉండే ఏజెంట్లకు ఆ పని అప్పజెప్పుతారు. ఇదంతా ఓ ఐదారు వారాలు బ్రహ్మండగా నడుస్తుంది. ఆ తర్వాతే…డబ్బులివ్వడం ఆపేస్తారు. అప్పటికే కోట్లాది రూపాయలు కేటుగాళ్ల ఖాతాల్లోకి వెళ్లితాయి..ఇంకేముంది..? ఓ ఫైన్ మార్నింగ్ ఆ కంపెనీ బోర్డు తిప్పేసింది.
ఇదెక్కడో కాదు…హైదరాబాద్ నగరశివారు…ఇప్పటి మేడ్చల్‌జిల్లా మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఫిర్జాదిగూడలో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. గతేడాది పీర్జాదిగూడలో శ్రీకాంత్ జిన్నా అనే వ్యక్తి , మరికొందరు కలిసి జనజాగరణ సమితి ట్రస్టును ప్రారంభించారు. ప్రారంభంలో కస్టమర్లను ఆకట్టుకునేవిధంగా కరపత్రాలు ప్రచురించారు. స్థానికంగా ఉన్న యువకులను ఏజెంట్లుగా నియమించుకొని తమ పని ప్రారంభించారు. కేవలం 10 వేలు కడితే, ఒక గ్రాము గోల్డ్‌తో పాటు తక్కువ సమయంలో డబ్బులు వస్తాయని నమ్మబలికారు. అలా సభ్యులుగా చేరినవారికి పల్లిమిషన్లు, ఆయిల్‌ప్యాకెట్లను అమ్మే బాధ్యతను కూడా అప్పజెప్పారు. ఒకరి నుంచి మరొకరు ఇలా చైన్‌సిస్టమ్‌లా అనేకమంది గ్రూపులుగా, కొన్ని యూనిట్లుగా జనజాగరణసమితి ట్రస్టులో లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. నాలుగైదు వారాలు డబ్బులు వచ్చి ఆ తర్వాత ఆగిపోయాయి. ఆఫీసుకు వెళ్తే అక్కడ ఎవరు లేకపోవడంతో తాము మోసపోయామని బాధితులు లబోదిబోమంటున్నారు.
శ్రీకాంత్ జిన్నా అనే వ్యక్తి కోటీశ్వరుడని తమను నమ్మించి మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జన జాగరణ సమితి ట్రస్ట్ ముందు బాధితులు నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.




మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం…
