18 ఏళ్ల క్రితం భర్త రాసిన ప్రేమలేఖను షేర్ చేసిన మహిళ.. ఇంట్రెస్టింగ్ లవ్‌స్టోరీ..!
ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిల నుంచి ప్రేమ లేఖల్లో ఇలాంటి మాటలు వస్తాయని మాత్రం అస్సలు ఊహించి ఉండరు..ఇది చాలా అరుదు..అంతే కాదు ఇన్నాళ్లు ఆ ఉత్తరాలను జాగ్రత్తగా దాచుకోవటం కూడా గొప్ప విషయం. వీళ్లది నిజంగా ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ అంటూ నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ప్రపంచంలో అత్యంత మధురమైన అనుభూతి ఏదైనా ఉందంటే అది ప్రేమ మాత్రమే. ప్రేమ, ప్యార్,ఇష్క్ మొదలైన అనేక పేర్లతో పిలవబడే ప్రేమ జీవశక్తిని పెంచుతుంది. ప్రేమలేఖ మరింత అందంగా ఉంటుంది. మనసులోని మాటలను అందంగా రాస్తే ఎవరినైనా ఆకట్టుకోవడం ఖాయం. మొబైల్ ఫోన్లు ప్రాచుర్యంలోకి రాకముందు, ప్రజలు తమ ప్రేమను చెప్పుకోవడానికి ప్రేమలేఖలు రాసుకునేవారు. అప్పట్లో ప్రేమలేఖ రాయడం చాలా పెద్ద విషయం. ఈ ప్రేమలేఖతో వివిధ పట్టణాల్లోని ప్రజలు ఒక్కటయ్యారు. మనసులోని భావాలను తెలుసుకుని ఆనందించేవారు. కానీ రోజురోజుకూ టెక్నాలజీ పెరిగిపోతున్న ఈ రోజుల్లో ప్రేమలేఖలు రాసుకోవడం కష్టమే.
టెక్నాలజీ అభివృద్ధితో ప్రేమలేఖల కాలం వెనక్కు పోయింది. కానీ, ఇక్కడ ఒక మహిళ 18 ఏళ్ల క్రితం తన భర్త తనకు రాసిన ప్రేమ లేఖను పంచుకుంది. కాలేజీ గ్రాడ్యుయేట్‌గా ఉన్నప్పుడు ఓ వ్యక్తి తన స్నేహితురాలికి ఈ ప్రేమలేఖలు రాశాడు. 18 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ ప్రేమ లేఖలను బయటకు తీసింది ఆ మహిళ. ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన 18 ఏళ్ల క్రితం నాటి ప్రేమలేఖను ఆమె తన ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఇప్పుడు ఈ లెటర్ వైరల్ అయ్యింది. ఆమె తన ఇళ్లు శుభ్రం చేస్తుండగా ఈ లవ్ లెటర్ బయటపడింది. ఆమె బీఈ, ఆమె భర్త ఎఈ ఐఐఎస్సీ చదువుకునే వయసులో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఈ సమయలో ఆమెకు భర్త ఉత్తరాలు రాసేవాడట. అయితే ఈ ఉత్తరాల్లో ప్రేమ వ్యవహారాలు ఏమీ ఉండేవి కావట. ఎక్కువగా తన చదువుకి సంబంధించిన విషయాలు, లేదా ప్రయోగాలకు సంబంధించిన వివరాలే ఎక్కువగా ఉండేవట. ఆమె పోస్ట్ చేసిన లేఖలో కూడా ఇదే విషయం స్పష్టంగా కనిపిస్తుంది.
Was cleaning up some old stuff yday when I rediscovered some old hand written letters that Mr Iyer had written to me some 18.5 years ago.
But who writes about lab experiments along with detailed diagrams in letters to their girl friend? (Yeah I said yes to this guy ?) pic.twitter.com/OSzWejrB4p
— Saiswaroopa (@Sai_swaroopa) April 3, 2023
ప్రయోగం ఎక్కడ జరుగుతుందో అక్కడికి తన స్నేహితులతో వెళుతున్నానని, నిద్ర వస్తున్నా సరే ప్రయోగంలో యాక్టివ్ గా పాల్గొంటున్నానని ఉత్తరాన్ని మొదలు పెట్టారు సాయి స్వరూప భర్త. అంతే కాదు అక్కడ 25 కేజీల ట్రక్ బ్యాటరీ మోసినప్పుడు ఆయనపడిన ఇబ్బందని కూడా లేఖలో పేర్కొన్నాడు. ఇక ఆ ప్రయోగానికి సంబంధించిన డీటైల్స్ ను ‘ది ఎక్స్‌పెరిమెంట్’ అనే క్యాప్షన్ పెట్టి మొత్తం రాసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం వీరి ప్రేమలేఖ నెటిజన్ల మనసుదోచుకుంటోంది. ఎందుకంటే, సాధారణంగా ప్రేమలేఖ అంటే.. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ ఉత్తరాలు రాస్తారు. కానీ తన చదువు, చేసే ప్రయోగాలు వంటివి ఇంత వివరణగా అతను లేఖ రాయడంపట్ల నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక అతని నుంచి ఇలాంటి ప్రేమలేఖలు అందుకున్న సాయి స్వరూపని కూడా మెచ్చుకోవాలంటున్నారు. ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిల నుంచి ప్రేమ లేఖల్లో ఇలాంటి మాటలు వస్తాయని మాత్రం అస్సలు ఊహించి ఉండరు..ఇది చాలా అరుదు..అంతే కాదు ఇన్నాళ్లు ఆ ఉత్తరాలను జాగ్రత్తగా దాచుకోవటం కూడా గొప్ప విషయం. వీళ్లది నిజంగా ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ అంటూ నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..