Election Result: కౌంటింగ్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తి.. ఎన్నికల ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశం.. పూర్తి వివరాలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్‌కు సర్వం సిద్ధం చేసింది ఎలక్షన్ కమిషన్. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 49 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 40 కేంద్ర కంపెనీ బలగాలు మూడంచెల భద్రతతో స్ట్రాంగ్ రూమ్‌లను కాపలా కాస్తున్నాయి. డిసెంబర్ 3వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ఉంటుంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్‌కు సర్వం సిద్ధం చేసింది ఎలక్షన్ కమిషన్. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 49 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. 40 కేంద్ర కంపెనీ బలగాలు మూడంచెల భద్రతతో స్ట్రాంగ్ రూమ్‌లను కాపలా కాస్తున్నాయి. డిసెంబర్ 3వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ఉంటుంది. ఆ తరువాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభం అవుతుందని ఎన్నికల కమిషన్ వెల్లడించారు.
తెలంగాణ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. 119 అసెంబ్లీ సెగ్మెంట్లకుగానూ మొత్తం 49 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 13 కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల లెక్కింపు జరగనుంది. స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసింది. కేంద్ర, రాష్ట్ర బలగాలతో మూడు అంచెల భద్రతను కల్పించింది. స్ట్రాంగ్ రూమ్స్ లోపల, బయట కెమెరాలను అమర్చి ప్రత్యేక నిఘాతో ఉంచింది. స్ట్రాంగ్ రూమ్‌లోకి వెళ్లేందుకు ఓకే ఎంట్రీ, ఎక్సిట్ ఉండేలా ఏర్పాట్లు చేయడంతో పాటు స్ట్రాంగ్ రూమ్‌కు డబుల్ లాక్ సిస్టం ఏర్పాటు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా తెలంగాణ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఒక్కో నియోజకవర్గానికి 14+1 చొప్పున టేబుల్స్ ఏర్పాటు చేయనుంది. ఎక్కువగా పోలింగ్ కేంద్రాలున్న నియోజకవర్గల ఓటింగ్ లెక్కింపుకు అధికంగా టేబుల్స్ ఉంటాయి. కూకట్‌పల్లి, ఉప్పల్, మల్కాజ్‌గిరి, పటాన్‌చెరు ఈ నాలుగు నియోజకవర్గాల్లో 400లకుపైగా పోలింగ్ కేంద్రాలు ఉండటంతో ఈ నియోజకవర్గాల్లో 20+1 టేబుళ్ల ఏర్పాటు చేశారు. రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం, మేడ్చల్ నియోజకవర్గాల్లో 500లకుపైగా పోలింగ్ కేంద్రాలు ఉండడంతో ఇక్కడ 28+1 టేబుళ్లను ఏర్పాటు చేసింది.
పోస్టల్ బ్యాలెట్స్ కోసం ప్రత్యేక టేబుల్స్ ఉంటాయి. పోస్టల్ బ్యాలెట్ 500ఓట్లకు ఒక టేబుల్ ఉంటుంది. ఈవీఎం ఓట్ల లెక్కింపుకు ముందే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ఉదయం 8గంటలకు ప్రారంభం అయితే ఒక్కో టేబుల్ కు 6గురు అధికారులు ఉంటారు. ఒకరు మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్‌వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్లు ఇద్దరితో మొత్తం ఒక్కో టేబుల్‌కు ఆరుగురు ఉంటారు. ప్రతీ ఈవీఎంను మూడు సార్లు లెక్కింపు ఉంటుంది కాబట్టి ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందని సీఈఓ వికాస్ రాజ్ తెలియజేశారు. మొత్తానికి పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అదే విధంగా కౌంటింగ్ సైతం ప్రశాంతంగా చేసేందుకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..