Telangana: ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ ఫలితాలు రిలీజ్.. ఇదిగో డీటేల్స్
Telangana Exit Poll: ఎగ్జిట్ పోల్స్.. పార్టీల్లో హైటెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. ముఖ్యంగా.. ఆ తెలంగాణ.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై.. సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టనున్నారు అనే విషయంపై తమ ఎగ్జిట్ పోల్ విడుదల చేసింది ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా. ఆ డీటేల్స్ మీకోసం...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో… ఇప్పుడు ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. ఇదే సమయంలో వివిధ సంస్థలు విడుదల చేస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా, ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదలయ్యాయి.
- అధికార బీఆర్‌ఎస్‌కు.. 34-44
- కాంగ్రెస్‌కు.. 63-73
- బీజేపీకి… 4-8
- ఎంఐఎం సహా ఇతరులకు 5-8 సీట్లు వస్తాయని అంచనా వేసింది ఈ ఎగ్జిట్ పోల్ సర్వే.
ఓటింగ్ శాతం వివరాలు:
బీఆర్‌ఎస్ : 36 శాతం
కాంగ్రెస్ : 42శాతం
బీజేపీ : 14 శాతం
ఎంఐఎం : 03 శాతం
ఇతరులు : 05 శాతం
ఉత్తర తెలంగాణలో బీఆర్‌ఎస్ 13, కాంగ్రెస్ 15, బీజేపీ 5 సీట్లు సాధిస్తాయని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ తేల్చింది. సెంట్రల్ తెలంగాణలో బీఆర్‌ఎస్ 9, కాంగ్రెస్‌కు 22సీట్లు వస్తాయని తెలిపింది. హైదరాబాద్ పరిధిలో బీఆర్‌ఎస్ 11, కాంగ్రెస్ 3, బీజేపీ 1, ఎంఐఎం 3 వస్తాయని వెల్లడించింది. ఇక సామాజికవర్గాల వారిగా చూస్తే కూడా BC, SC, ST, ముస్లిం వర్గాల వారు కాంగ్రెస్‌ను ఆదరించినట్లు ఈ సర్వే పేర్కొంది. సీఎంగా మాత్రం కేసీఆర్ వైపు ఎక్కువ శాతం మంది ప్రజలు మొగ్గు చూపగా.. ఆ తర్వాత స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నారు.
అయితే గురువారం పోలింగ్ అనంతరం విడుదలైన సర్వేల్లో కొన్ని కాంగ్రెస్‌కు పట్టం కట్టగా.. మరికొన్ని హంగ్ వస్తుందని చెప్పాయి. ఇంకొన్ని బీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపాయి.
మిగితా రాష్ట్రాలకు సంబంధించి.. మిజోరంలో ZPM కు, చత్తీస్‌గఢ్ లో కాంగ్రెస్‌కు, మధ్యప్రదేశ్‌లో బీజేపీకి, రాజస్థాన్‌లో కాంగ్రెస్, బీజేపీలకు నెక్ టు నెక్ ఉన్నట్టు తెలిపింది ఇండియా టుడే ఎగ్జిట్ పోల్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..