AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News Big Debate: సాగరయుద్ధంలో ధర్మం ఎవరిది? అధర్మంగా వ్యవహరించింది ఎవరు?

నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ నీటి విడుదల వ్యవహారం తెలుగురాష్ట్రాల మద్య అగ్గి రాజేసింది. అటు ఆంధ్రా పోలీసులు, ఇటు తెలంగాణ పోలీసులూ ఇరువైపులా పెద్దఎత్తున మోహరించడంతో రెండు రోజులుగా యఅక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో చివరకు కృష్ణా రివర్‌బోర్డు కూడా రంగంలో దిగి వెంటనే నీటి విడుదల ఆపేయాలని ఆదేశించింది. అటు కేంద్రం కూడా వివాదంపై స్పందించి ఇరు రాష్ట్రాలను చర్చలకు పిలిచిన కేంద్రం... సీఆర్‌పీఎఫ్‌ బలగాల పహారాలో ప్రాజెక్టులు ఉంచటంతో పాటు.. క్రిష్ణా బోర్డు ఆదేశాల ఖచ్చితంగా అమలు జరిగేలా చూస్తామని ప్రకటించింది.

Big News Big Debate: సాగరయుద్ధంలో ధర్మం ఎవరిది? అధర్మంగా వ్యవహరించింది ఎవరు?
Big News Big Debate
Ram Naramaneni
|

Updated on: Dec 01, 2023 | 7:10 PM

Share

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల విడుదల అంశం మరోసారి రచ్చగా మారింది. తెలంగాణ పోలీసుల ఆధీనంలో ఉన్న సాగర్‌ డ్యామ్ నుంచి ఏపీ అధికారులు పోలీసుల సాయంతో నీటిని విడుదల చేశారు. ఈ సమయంలో తెలంగాణ పోలీసులు కూడా అక్కడికి భారీ సంఖ్యలో రావడంతో.. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ ఇరు రాష్ట్రాల అధికారులు, పోలీసు బలగాలతో యుద్ధవాతావరణాన్ని తలపిస్తోంది సాగర్‌ డ్యామ్‌. ఎలాంటి అనుమతి, సమాచారం లేకుండా డ్యామ్‌ వద్దకు వచ్చిన పోలీసులు ప్రజాఆస్తులు ధ్వంసం చేసినట్టు ఆరోపిస్తున్నారు తెలంగాణ అధికారులు. సీసీ కెమెరాలు సహా ప్రజాఆస్తులు ధ్వంసం చేశారంటున్న తెలంగాణ అధికారులు, ఏపీ పోలీసులు, ఇరిగేషన్‌ సిబ్బందిపై 441, 448, 427 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. మరోవైపు తెలంగాణ ఫిర్యాదు మేరకు వెంటనే నీటి విడుదల ఆపేయాలని ఏపీని ఆదేశించింది కృష్ణా రివర్‌బోర్డు.

తెలంగాణలో పోలింగ్‌ జరుగుతున్న రోజే సాగర్‌ ప్రాజెక్టు వద్ద వివాదం సృష్టించడం వెనక రాజకీయ కోణం ఉందన్నారు సీపీఐ నారాయణ. అటు విపక్షాల నుంచి విమర్శలు రావడంతో దీనిపై స్పష్టత ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. నాగార్జునసాగర్ నీటి విడుదల విషయంలో న్యాయబద్ధంగానే వ్యవహరించామని.. 13 గేట్లు ఏపీ భూభాగంలో ఉన్నాయన్నారు అంబటి రాంబాబు. గత ప్రభుత్వ హయంలో జరిగిన తప్పిదాల వల్ల రాష్ట్రానికి అన్యాయం జరిగిందని.. ఇప్పుడు కూడా ప్రజల దాహర్తిని తీర్చడం కోసం నీటిని విడుదల చేస్తే కొందరు పనిగట్టుకుని రాజకీయం చేస్తున్నారన్నారు మంత్రి అంబటి.

మొత్తానికి తెలుగురాష్ట్రాల మధ్య మరోసారి ప్రాజెక్టు వ్యవహారం అటు అధికార వర్గాలను కలవరపెడుతుంటే.. ఇటు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. మరి ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..