Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goshamahal Election Result 2023: గోషామహల్ మళ్లీ రాజాసింగ్‌దే.. భారీ మెజార్టీతో గెలుపు

Goshamahal Assembly Election Result 2023 Live Counting Updates:  రాష్ట్రంలో అత్యధిక కమర్షియల్ ట్యాక్స్ లు కట్టే నియోజకవర్గం కూడా గోషా మహలే. పాన్ డబ్బాలు, గప్ చుప్‌ల నుంచి మొదలుకొని పెద్ద పెద్ద వ్యాపారాలకు ఈ నియోజకవర్గం ఫేమస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సారి ఇక్కడి నుంచి రాజా సింగ్ మరోసారి బీజేపీ నుంచి బరిలోకి దిగారు. బీఆర్‌ఎస్ నుంచి నందకిషోర్ వ్యాస్, కాంగ్రెస్ నుంచి మొగిలి సునీత రంగంలోకి దిగారు. విజయం మాత్రం రాజాసింగ్‌నే వరించింది.

Goshamahal Election Result 2023: గోషామహల్ మళ్లీ రాజాసింగ్‌దే.. భారీ మెజార్టీతో గెలుపు
Goshamahal
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 03, 2023 | 3:06 PM

గోషామహల్ మళ్లీ రాజాసింగ్‌ కాషాయ జెండా ఎగరేశారు.  బీఆర్‌ఎస్ అభ్యర్థి నందకుమార్ వ్యాస్‌పై  21,457 ఓట్ల మెజార్టీతో రాజాసింగ్ ఆయన మూడవసారి గెలుపొంది.. హ్యాట్రిక్ కొట్టారు. హైదరాబాద్ మహానగరానికి గుండెకాయలాంటి ప్రాంతం గోషామహల్ (Goshamal Assembly Election). దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ జీవనం సాగిస్తారు. మినీ ఇండియాగా ఈ ప్రాంతాన్ని చెప్పుకోవచ్చు. గోషామహల్ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. అంతకుముందు ఈ నియోజకవర్గం మహారాజ్ గంజ్ గా ఉండేది. మహారాజ్ గంజ్ 2004లో కాంగ్రెస్ అభ్యర్థి ముఖేశ్ గౌడ్ విజయం సాధించారు. 2009లో గోషామహల్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి ముఖేశ్ గౌడ్ విజయం సాధించారు. వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. 2014, 2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ విజయం సాధించారు. ఈ నియోజకవర్గం పరిధిలో గోషామహల్, అఫ్జల్ గంజ్, ఆగపూర, బొగ్గులకుంట, దూల్ పేట, రామకోటి, సుల్తాన్ బజార్, మోజాం జాహీ మార్కెట్ తదితర ప్రాంతాలు వస్తాయి. దాదాపుగా మూడు లక్షల మంది ఓటర్లు ఇక్కడ ఉన్నారు. 2018లో బిజెపి తెలంగాణ అసెంబ్లీలో గెలిచిన ఏకైక సీటు ఇది. రాజాసింగ్‌ తన సమీప TRS ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌ సింగ్‌ రాదోడ్‌ పై 17734 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తాజాగా మరోసారి గోషామహల్‌లో బీజేపీ జెండా ఎగరేశారు రాజాసింగ్.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 లైవ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్

3 ఫోర్లు, 2 సిక్స్‌లు.. 300 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే..
3 ఫోర్లు, 2 సిక్స్‌లు.. 300 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే..
కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు