KTR: తగ్గేదేలే.. వేడుకలకు సిద్ధంగా ఉండండి. మంత్రి కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
అయితే గెలుపుపై అటు కాంగ్రెస్ ధీమాగా ఉంటే. బీఆర్‌ఎస్ మాత్రం గెలిచేది తామే అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. ఎగ్జిట్ పోల్స్‌లను తలకిందులు చేస్తూ డిసెంబర్ 3వ తేదీన కారు దూసుకెళ్తోందని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఇప్పటికే మంత్రి కేటీఆర్ ఎగ్జిట్ పోల్స్ విడుదల తర్వాత ఆసక్తిర ట్వీట్ చేశారు. “చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయాను...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. ఆదివారం ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. డిసెంబర్ 3వ తేదీన మొత్తం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్‌కు మద్ధతుగా ఫలితాలు ఉండడంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
అయితే గెలుపుపై అటు కాంగ్రెస్ ధీమాగా ఉంటే. బీఆర్‌ఎస్ మాత్రం గెలిచేది తామే అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది. ఎగ్జిట్ పోల్స్‌లను తలకిందులు చేస్తూ డిసెంబర్ 3వ తేదీన కారు దూసుకెళ్తోందని గులాబీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఇప్పటికే మంత్రి కేటీఆర్ ఎగ్జిట్ పోల్స్ విడుదల తర్వాత ఆసక్తిర ట్వీట్ చేశారు. “చాలా కాలం తర్వాత రాత్రి కంటి నిండా నిద్రపోయాను. ఎగ్జిట్ పోల్స్ పెరగొచ్చు.. కానీ ఎగ్జాట్ ఫలితాలు మాకు శుభవార్తను చెబుతాయి” అంటూ ‘X'(‘ట్విటర్)లో పేర్కొన్నారు.
కేటీఆర్ ట్వీట్..
Hattrick Loading 3.0 👍
Get ready to celebrate guys 🎉 pic.twitter.com/4wJRJujU4w
— KTR (@KTRBRS) December 2, 2023
ఇదిలా ఉంటే తాజాగా ఎన్నికల ఫలితాలకు మరికొద్ది గంటలు మిగిలి ఉన్న నేపథ్యంలో కేటీఆర్ మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. గన్ గురి పెడుతున్నట్లు ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేసిన మంత్రి కేటీఆర్.. ‘హ్యాట్రిక్ లోడింగ్ 3.0. వేడుకలు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో కార్యకర్తల్లో, నాయకుల్లో కేటీఆర్ జోష్ నింపారు. మరి కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నట్లు బీఆర్‌ఎస్ మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకుంటుందో లేదో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..