Telangana: పోటీ చేసిన ప్రముఖులు.. ఇప్పుడు ఎలా రిలాక్స్ అవుతున్నారో తెలుసా?
ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్‌కే ఎడ్జ్ కనిపించినా.. కొన్ని పోల్స్ మాత్రం బీఆర్ఎస్ వైపు ఉన్నాయి. సో, రిజల్ట్ ఎవరివైపు ఉంటుందో చెప్పలేని పరిస్థితి. అందుకే, అభ్యర్ధులు ఫుల్ టెన్షన్‌లో ఉన్నారు. ఆ రిజల్ట్స్ టెన్షన్ నుంచి బయటపడడానికి అభ్యర్ధులు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ స్ట్రెస్ బస్టర్‌గా లీడర్స్ చేస్తున్న ప్రయత్నాలేంటి?
తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు ఎలా వస్తాయో చెప్పలేని పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ ఇస్తున్నా.. ఎగ్జాక్ట్ పల్స్ మరోలా ఉండొచ్చేమోనన్న ఆశలు అధికార పార్టీలో కనిపిస్తున్నాయి. . మరికొందరైతే హంగ్ రావొచ్చని చెబుతున్నారు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే.. బీఆర్ఎస్‌కు షాక్. బీఆర్ఎస్ గెలిస్తే.. కాంగ్రెస్‌కు షాక్. మరీ ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ జరిగింది. ఎన్నికల ప్రచారంలో ఛాలెంజెస్ కూడా వినిపించాయి. కాంగ్రెస్‌లో చేరుతున్న సమయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఓ సవాల్ విసిరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు గెలిచి చూపిస్తాం అన్నారు. జిల్లాను క్లీన్ స్వీప్ చేసి.. ఖమ్మం నుంచి ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వకుండా చేస్తామన్నారు. మరి అలా జరక్కపోతే ఏంటి పరిస్థితి? 50వేలకు ఒక్క ఓటు తగ్గినా రాజకీయాలు వదిలేస్తానంటూ హుజూర్‌నగర్ నుంచి పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఒకవేళ తగ్గితే? సో, చాలామంది నేతలకు రిజల్ట్స్ టెన్షన్ పట్టుకుంది. ఈ నరాలు తెగే ఉత్కంఠను మరికొన్ని గంటల పాటు తట్టుకోవాల్సిందే. ఆ టెన్షన్‌ను మరిచిపోయేందుకు లీడర్లు రకరకాల ప్రయత్నం చేస్తున్నారు. కొందరు యోగా చేస్తున్నారు. మరికొందరు ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నారు. మనవళ్లు, మనవరాళ్లతో గడుపుతున్నారు. కొందరు సరదాగా ఆడుకుంటున్నారు.
ఎన్నికల ఫలితాలంటే మామూలు విషయం కాదు. రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్న ప్రజలకే.. ఎవరు గెలుస్తారు, ఏ పార్టీకి అధికారం దక్కుతుందన్న టెన్షన్ పెరిగిపోయింది. అలాంటిది, స్వయంగా పోటీలో ఉన్న అభ్యర్థులకు ఇంకెలా ఉంటుంది. అందుకే, తమను తాము మరిచిపోయేంతగా రిలాక్స్ అవుతున్నారు. సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క చక్కగా షటిల్ ఆడుకున్నారు. వైట్ అండ్ వైట్ డ్రస్‌లో, పంచె కట్టుతో కనిపించే భట్టి విక్రమార్క.. చాలా ప్రశాంతంగా గేమ్‌లోకి దిగిపోయారు.
కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్.. స్థానికులను పలుకరిస్తూ బిజీగా గడిపారు. మహాశక్తి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత కార్యకర్తలతో సెల్ఫీ దిగారు. పోలింగ్ ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. ఎంపీ కార్యాలయానికి వెళ్లి స్థానిక నేతలతో ఎన్నికల కౌంటింగ్‌పై చర్చించారు. గెలుస్తామనే ధీమా వ్యక్తం చేసిన బండి సంజయ్ పలువురు కార్యకర్తలకు స్వీట్ తినిపించారు. మొత్తానికి ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ రిలాక్స్ అవుతూ వచ్చారు.
ఇక ఆదిలాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న.. హ్యాపీగా కుటుంబంతో కలిసి టైం స్పెండ్ చేశారు. రెండు మూడు నెలలుగా ప్రచారం కోసం ప్రజల్లోనే తిరిగిన జోగు రామన్న.. పోలింగ్ ముగియడంతో ఫ్యామిలీ కోసం సమయం ఇచ్చారు. మనవళ్లతో ఆడుకున్నారు. స్ట్రెస్ నుంచి రిలీవ్ అయ్యేందుకు ఫ్యామిలీనే బెస్ట్ మెడిసిన్‌గా భావించారు.
ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు.. తిరుమల వెళ్లారు. స్వామివారికి తలనీలాలు సమర్పించారు. సహజంగా గెలిచిన తరువాత దేవుడికి కృతజ్ఙత చెప్పేందుకు ఆలయాలకు వెళ్తారు. తుమ్మల నాగేశ్వరరావు ముందుగానే వెళ్లారు.
మంత్రి సత్యవతి రాథోడ్.. ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్ధుల కోసం బాగానే ప్రచారం చేశారు. నియోజకవర్గాలు తిరిగి అభ్యర్ధుల గెలుపు కోసం కష్టపడ్డారు. కేసీఆర్ మూడోసారి సీఎం అవ్వాలనే సంకల్పంతో చెప్పులు కూడా వేసుకోవడం లేదు. కొన్ని వారాల పాటు బీఆర్ఎస్ కోసం కష్టపడిన సత్యవతి రాథోడ్.. ఇప్పుడు ఫ్యామిలీతో రిలాక్స్ అవుతున్నారు.
బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సైతం తిరుమలకు వెళ్లారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. బీజేపీ అభ్యర్థుల గెలుపుకోసం బాగా కష్టపడ్డారు. పోలింగ్ ముగియడంతో స్వామివారి దర్శనానికి వెళ్లారు.
మొత్తానికి ఎన్నికల రిజల్ట్ వచ్చే లోపు టైం స్పెండ్ చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. తుమ్మల నాగేశ్వరరావు, లక్ష్మణ్ తిరుమలకు వెళ్తే.. జోగు రామన్న, సత్యవతి రాథోడ్ కుటుంబంతో గడిపారు. భట్టి విక్రమార్క షటిల్ ఆడుతూ, బండి సంజయ్ సెల్ఫీలు దిగుతూ టెన్షన్‌ను తగ్గించుకునే ప్రయత్నం చేశారు.
తెలంగాణ పోలింగ్ ఫలితాల కవరేజ్ కోసం..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.