Weekend Hour: హంగూ.. ఆర్భాటం! తెలంగాణ ఫలితాలపై యావత్ దేశం ఆసక్తి
అందరి చూపు.. తెలంగాణ ఎన్నికల ఫలితాల వైపే. అధికార పార్టీకి క్లియర్ మెజార్టీ వస్తుందా..? కాంగ్రెస్ పార్టీకి కంఫర్ట్ ఫిగర్స్ వస్తాయా? కింగ్ మేకర్ అవుతామన్న కమలం ఆశలు నెరవేరుతాయా? రిజల్ట్‌పై తెలంగాణతో పాటు యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ అంశాలపైనే ఈ రోజు బిగ్ న్యూస్ బిగ్ డిబేట్.....

తెలంగాణ దంగల్లో గెలుపు ఎవరిని వరిస్తుంది..? గులాబీ పార్టీ జోరు కొనసాగిస్తుందా..? సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారా? మేజిక్ ఫిగర్‌ను దాటేసి క్లియర్ మెజార్టీ వస్తుందని BRS విశ్వాసం వ్యక్తం చేస్తోంది. సర్వే ఫలితాలు ఎలా ఉన్నా..బీఆర్ఎస్ మరోసారి గెలిచి తీరుతుంని..ఇందులో ఏమాత్రం సందేహం లేదంటున్నారు. ఒకవేళ ఏదైనా మెజార్టీకి దగ్గరగా వస్తే..ఆ తర్వాత ఏం చేయాలనేది గులాబీబాస్ ఇప్పటికే క్లారిటీగా ఉన్నారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.
అటు కాంగ్రెస్‌పార్టీ కూడా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. తమకు క్లియర్ మెజార్టీ వస్తుందని చెబుతున్నాయి. మేజిక్ ఫిగర్ దాటేసి దాదాపు 75 స్థానాలు దక్కించుకుంటామని హస్తం పార్టీ నేతలు అంటున్నారు. అటు కమలం శ్రేణులు కూడా తాము కింగ్‌మేకర్ అవుతామని అంటున్నాయి. ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే తామే కీ రోల్ పోషిస్తామనే ధీమాతో ఉన్నాయి.
తెలంగాణా ఫ్యూచర్ పొలిటికల్ పిక్చర్‌పై డజనుకు పైగా ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. వీటిలో కొన్ని సర్వేలు కాంగ్రెస్‌కీ, మరికొన్ని సర్వేలు బీఆర్‌ఎస్‌కి సింగిల్ లార్జెస్ట్ పార్టీ స్టేటస్ వస్తుందని చెప్పేశాయి. ఇంకొన్ని సర్వేలైతే..హంగ్ పరిస్థితి పక్కా అంటూ సిగ్నల్ ఇచ్చేశాయి. ఇదే మూడు ప్రధాన పార్టీల్నీ అప్రమత్తం చేసింది. ఒకవేళ హంగ్ పరిస్థితి దాపురిస్తే ఏంచేయాలి అనే కసరత్తును ముమ్మరం చేశారు ఆయా పార్టీ నేతలు. తమవాళ్లు అవతలి పార్టీలకు దొరికిపోకుండా కాపాడుకోడానికి ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు ఉన్నారట. ముఖ్యంగా క్యాంపు రాజకీయాల్లో అందె వేసిన చేయిగా పేరున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హైదరాబాద్‌లో అడుగుపెట్టేశారు. తమ అభ్యర్థులను కాపాడుకునేపనిలో పడ్డారు. అటు ఏఐసీసీ నేతలు కూడా రేపు రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ పోలింగ్ ఫలితాల కవరేజ్ కోసం..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
