Madhira Election Result 2023: మధిరలో మరోసారి భట్టి ఘనవిజయం.. సీఎం రేస్‌లో…
Madhira Assembly Election Result 2023 Live Counting Updates: మధిర అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ).. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్స్ పార్టీకి అత్యంత కీలకమైన నియోజకవర్గల్లో మధిర ఒకటి.. 1957లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్(ఐ) 9 సార్లు విజయం సాధించింది. 5 సార్లు సీపీఎం, పీడీఎఫ్, తెలుగుదేశం ఒకసారి చొప్పున విజయం సాధించాయి. తాజా ఫలితాల్లో భట్టి మరోసారి విజయం సాధించారు.

మధిరలో కాంగ్రెస్ భట్టి విక్రమార్క విజయం సాధించారు. 34,529 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌పై గెలుపొందారు. దీంతో భట్టి మధిర నుంచి వరసగా నాలుగుసార్లు గెలిచనట్లైంది. సీఎం పదవి ఇస్తే బాధ్యతగా నిర్వర్తిస్తానన్నారు భట్టి.
మధిర అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ).. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో మధిర (Madhira Assembly Election) ఒకటి. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఈ నియోజకవర్గానికి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2023 ఎన్నికల్లో భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ నేత లింగాల కమల్ రాజ్ మధ్యనే ప్రధాన పోటీ కొనసాగింది. బీజేపీ నుంచి పెరుమాళ్ళపల్లి విజయరాజు, సీపీఎం నుంచి పాలడుగు భాస్కర్ కూడా బరిలో నిలిచారు. ఫైనల్‌గా ఇక్కడి ఓటర్లు భట్టికే జై కొట్టారు.
మధిర నియోజకవర్గంలో మొత్తం 2.21 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొన్నటి పోలింగ్‌లో ఈ నియోజకవర్గంలో 87.93 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం ఐదు మండలాలు ఉన్నాయి.. మధిర, బోనకల్, చింతకాని, ముదిగొండ, యర్రుపాలెం ఉన్నాయి.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 లైవ్
మధిర నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రం..
1957లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్(ఐ) 9 సార్లు విజయం సాధించింది. 5 సార్లు సీపీఎం, పీడీఎఫ్, తెలుగుదేశం ఒకసారి చొప్పున విజయం సాధించాయి. మధిర నియోజకవర్గంలో నుంచి పోటీచేసిన ప్రముఖులలో బోడేపూడి వెంకటేశ్వరరావు, దుగ్గినేని వెంకయ్య, కట్టా వెంకటనర్సయ్య రెండుసార్ల చొప్పున గెలుపొందారు. ఇక్కడ ఎప్పుడూ కాంగ్రెస్.. కమ్యూనిస్టు పార్టీ మధ్యనే ఎక్కువగా పోటీ ఉండేది.. తెలంగాణ ఏర్పడక ముందు.. ఏర్పడిన తర్వాత మారిన పరిస్థితులతో కాంగ్రెస్ – బీఆర్ఎస్ మధ్య పోటీ నెలకొంది. 2009 నుంచి ప్రస్తుత సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వరుసగా మూడు సార్లు విజయం సాధించారు.
2009కి ముందు భట్టి విక్రమార్క ఎమ్మెల్సీగా ఉన్నారు. 2009లో మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి.. సీపీఎం అభ్యర్థి లింగాల కమల్ రాజ్ పై గెలుపొందారు. 2014లో మల్లు భట్టి విక్రమార్క 12,329 ఓట్ల ఆధిక్యతతో సీపీఎం ప్రత్యర్ధి కమల్ రాజ్‌ను ఓడించారు. ఇక్కడ నుంచి టీడీపీ తరుపున పోటీచేసిన కీలక నేత మోత్కుపల్లి నరసింహులు మూడో స్థానంలో నిలిచారు. మోత్కుపల్లికి 46044 ఓట్లు మాత్రమే వచ్చాయి.
2018 ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌పై 3,567 ఓట్ల మెజార్టీతో భట్టి గెలిచారు. మల్లు భట్టి విక్రమార్కకు 80,598 ఓట్లు రాగా, కమల్ రాజ్‌కు 77,031 ఓట్లు వచ్చాయి. పోటాపోటిగా జరిగిన ఈ ఎన్నికల్లో భట్టి మూడోసారి విజయకేతనం ఎగురవేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్