Munugode Election Result 2023: మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ఘన విజయం.. మెజారిటీ ఎంత వచ్చిందంటే..?
Munugode Rural Assembly Election Result 2023 Live Counting Updates: ఫ్లోరైడ్ అనే మాట వినగానే గుర్తుకు వచ్చేదీ మునుగోడు నియోజక వర్గం. రాష్ట్ర రాజధానిని అనుకొని ఉన్న ఈ నియోజక వర్గం అభివృద్ధిలో మాత్రం అంతంత మాత్రమే. పాలకుల హామీలు నీటి మూటలుగనే మిగిలాయి. ఒకప్పటి కామ్రేడ్ల కంచుకోటలో రాజకీయ సమీకరణాలు సమీకరణాలు మారుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అధిపత్యం కనబరుస్తూ వస్తున్నాయి.

ఫ్లోరైడ్ అనే మాట వినగానే గుర్తుకు వచ్చేదీ మునుగోడు నియోజక (Munugode Assembly Election) వర్గం. రాష్ట్ర రాజధానిని అనుకొని ఉన్న ఈ నియోజక వర్గం అభివృద్ధిలో మాత్రం అంతంత మాత్రమే. ఒకప్పటి కామ్రేడ్ల కంచుకోటలో రాజకీయ సమీకరణాలు సమీకరణాలు మారుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అధిపత్యం కనబరుస్తూ వస్తున్నాయి. గత ఉప ఎన్నికల్లో మాదిరిగానే స్థానిక ప్రజలు గులాబీ దండుకు అండగా ఉంటారా..? లేదంటే ప్రతిపక్ష పార్టీలకు అవకాశమిస్తారా..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై గెలుపొందారు. ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. మునుగోడు నుంచి దాదాపు 42 వేల ఓట్లతో ఘనవిజయం సాధించారు. అయితే, కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో సీహెచ్ కృష్ణారెడ్డి బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదరకపోవడంతో సీపీఎం కూడా ఇక్కడి నుంచి పోటీచేసింది. సీపీఎం నుంచి దోనూరి నర్సిరెడ్డి పోటీ చేశారు.
మునుగోడు రాజకీయ ముఖచిత్రం..
ఫ్లోరైడ్ కు పెట్టింది పేరు మునుగోడు ప్రాంతం. ఒకప్పుడు ప్రపంచంలో అత్యధిక ఫ్లోరైడ్ కలిగిన ప్రాంతంగా గుర్తింపు పొందింది. అన్ని రంగాల్లో వెనుకబడి ప్రాంతంగా పేరుందిన ఈ నియోజకవర్గంలో మునుగోడు, చండూరు, నాంపల్లి, మర్రిగూడ, చౌటుప్పల్, నారాయణపురం, గట్టుప్పల్ ఏడు మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో 2,48,474 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,24,473 మంది పురుషులు ఉండగా, 1,23,996 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో 70 శాతం బలహీన వర్గాలకు చెందిన ఓటర్లు ఉన్నారు. ఇందులో గౌడ, పద్మశాలీల సామాజిక ఓటర్లు అత్యధికంగా ఉన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1967లో మునుగోడు నియోజక వర్గంగా అవతరించింది. మొత్తం 12 సార్లు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ ఆరు సార్లు, సిపిఐ నాలుగు సార్లు గెలిచాయి. బీఆర్ఎస్ రెండు సార్లు విజయం సాధించింది. ఈ నియోజకవర్గ నుంచి ఐదు సార్లు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 ఎన్నికల్లో కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ తరుఫున గెలిచారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. రాష్ర్టంలో మారిన రాజకీయ సమీకరణాలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేయడంతో 2022లో జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గెలిచారు. ఉప ఎన్నికలో త్రిముఖ పోటీ జరిగినప్పటికీ.. బీఆర్ఎస్, బీజేపిలు మాత్రం నువ్వా- నేనా అన్నట్లు తలపడ్డాయి. బీజెపికి బలం లేకపోయినా తన వ్యక్తిగత చరిష్మాతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ కు ముచ్చమటలు పట్టించారు. అయితే తాజా మారిన పరిణామాలతో మరోసారి కాంగ్రెస్ గూటికి చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుని.. ఘన విజయం సాధించారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 లైవ్
1985 తెలుగు దేశం బలపరిచిన సిపిఐ అభ్యర్థి ఉజ్జిని నారాయణరావు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పైన గెలిచారు. 1989,1994 ఈ రెండు ఎన్నికల్లో కూడా సేమ్ రిపీట్ అయ్యింది. 1999లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి సిపిఐ అభ్యర్థి ఉజ్జీని నారాయణరావుపైన గెలుపొందారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థి పల్ల వెంకట్ రెడ్డి విజయం సాధించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ సిపిఎం బలపరిచిన సిపిఐ అభ్యర్థి ఉజ్జిని యాదగిరి రావు గెలుపొందారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు.
మొత్తంగా పరిశీలిస్తే.. గత 40 సంవత్సరాల నుంచి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అనేక విషమ పరీక్షలు ఎదుర్కొంది. అయినా 2018లో విజయం సాధించింది. 2022 ఉప ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో నిలిచి గెలుపొందారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్