Nama Nageswara Rao: టీఆర్ఎస్ ఎంపీ నామాకు ఈడీ సమన్లు.. 25న విచారణకు హాజరుకావాలని సూచన..

ED summons MP Nama Nageswara Rao: టీఆర్ఎస్ నాయకుడు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఇళ్లు , కంపెనీల్లో ఇటీవల ఈడీ సోదాలు చేసిన సంగతి

Nama Nageswara Rao: టీఆర్ఎస్ ఎంపీ నామాకు ఈడీ సమన్లు.. 25న విచారణకు హాజరుకావాలని సూచన..
Nama Nageswara Rao

ED summons MP Nama Nageswara Rao: టీఆర్ఎస్ నాయకుడు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఇళ్లు , కంపెనీల్లో ఇటీవల ఈడీ సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఖమ్మం, హైదరాబాద్‌ సహా మొత్తం 6 చోట్ల సోదాలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతోపాటు మధుకాన్ డైరెక్టర్ల ఇళ్లల్లో కూడా సోదాలు చేశారు. అనంతరం బుధవారం ఈడీ ఎంపీ నామా నాగేశ్వరరావుకు సమన్లు జారీ చేసింది. ఈనెల 25న విచారణకు హాజరు కావాలని ఎంపీ నామా నాగేశ్వరరావుకు సూచించింది. బ్యాంకు రుణాలను మళ్లించిన కేసులో నామా నాగేశ్వరరావుకు సమన్లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మధుకాన్ కేసులో ఉన్న నిందితులందరికీ ఈడీ సమన్లు జారీ చేసింది.

మూడు రోజుల క్రితం ఎకకాలంలో.. నామాకు చెందిన ఇళ్లు, ఆఫీస్, మధుకాన్ కాంపెనీ, డైరెక్టర్ల ఇళ్లల్లో 20 గంటల పాటు సోదాలు చేశారు. ఈ సందర్భంగా కీలక పత్రాలు, కంప్యూటర్లు, బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి ఈడీ కీలక ఆధారాలు సేకరించింది. నగదు, డాక్యుమెంట్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే ప్రాజెక్టుకు సంబంధించి పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మధుకాన్ కంపెనీ డైరెక్టర్ల స్టేట్మెంట్ కూడా ఈడీ అధికారులు రికార్డు చేసుకున్నారు. సోదాలు పూర్తయిన తర్వాత విచారణకు ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని ఈడీ నోటీసులో తెలిపింది.

Also read:

Uttar Pradesh: పాపం పసిపాప..గంగా నదిలో చెక్క పెట్టెలో పెట్టి వదిలేశారు.. తర్వాత ఏమైందంటే..

Encounter: ఉలిక్కిపడిన మన్యం.. విశాఖ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి!