Uttar Pradesh: పాపం పసిపాప..గంగా నదిలో చెక్క పెట్టెలో పెట్టి వదిలేశారు.. తర్వాత ఏమైందంటే..

Uttar Pradesh: కుంతీదేవి పొత్తిళ్ళలోని పసిబిడ్డగా ఉన్నపుడు కర్ణుడిని నదిలో వదిలిపెట్టేసిందని పురాణం. ఆ సీన్ మనం ఎన్నో సినిమాల్లో చూశాం కూడా. ఒక పెట్టెలో కర్ణుడిని పెట్టి దానిని నదిలో వదిలేస్తుంది కుంతీదేవి.

Uttar Pradesh: పాపం పసిపాప..గంగా నదిలో చెక్క పెట్టెలో పెట్టి వదిలేశారు.. తర్వాత ఏమైందంటే..
Uttar Pradesh Girl Child

Uttar Pradesh: కుంతీదేవి పొత్తిళ్ళలోని పసిబిడ్డగా ఉన్నపుడు కర్ణుడిని నదిలో వదిలిపెట్టేసిందని పురాణం. ఆ సీన్ మనం ఎన్నో సినిమాల్లో చూశాం కూడా. ఒక పెట్టెలో కర్ణుడిని పెట్టి దానిని నదిలో వదిలేస్తుంది కుంతీదేవి. సరిగ్గా ఇదే సీన్ రిపీట్ అయింది ఉత్తరప్రదేశ్ లో. అయితే, అందులో ఉన్నది ఒక ఆడ బిడ్డ. మరి ఏ తల్లి ఆ పని చేసిందో కానీ.. ఆ బిడ్డకు ఎంతో ఆయుష్షు ఉంది అందుకే కామోసు ఎటువంటి ప్రమాదానికి లోనుకాకుండా సురక్షితంగా నది ఒడ్డుకు చేరింది. రోజుల వయసున్న పసిపాపను ఆ గంగమ్మ సుతక్షితంగా ఒడ్డుకు చేర్చింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి..

ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ దగ్గర సదర్ కొత్వాలి ప్రాంతానికి చెందిన దాద్రి ఘాట్ వద్ద గుల్లు చౌదరి నివసిస్తారు. ఈయన అక్కడ గంగానదిలో చేపలు పట్టుకుని జీవిస్తారు. మంగళవారం సాయంత్రం ఆయన గంగానది ఒడ్డున ఉండగా.. నదిలో ఒక పెద్ద చెక్క పెట్టె తేలుతూ రావడం కనిపించింది. దానిని మొదట ఆయన పట్టించుకోలేదు. కానీ, ఆ పెట్టె ఒడ్డువైపుగా వస్తుండగా చూసి అనుమానం వచ్చి దానిని పట్టుకున్నారు. జాగ్రత్తగా ఒడ్డుకు తీసుకువచ్చారు. ఆ సమయంలో అక్కడ ఉన్న స్థానికులు కూడా ఆ పెట్టె చూసి దగ్గరకు వచ్చి చూశారు. వారి సమక్షంలో ఆ పెట్టె మూట తెరిచి చూసిన గుల్లు చౌదరితో పాటు అక్కడ చేరిన అందరూ అవాక్కయ్యాడు. ఆ పెట్టెలో చునారితో చుట్టి ఉన్న ఒక పసిబిడ్డ కనిపించింది. ఆ పసిబిడ్డతో పాటు ఆ పెట్టెలో దేవతల ఫోటోలు పెట్టి ఉన్నాయి. దుర్గామాత తొ పాటు చాల దేవతల ఫోటోలు అందులో ఉన్నాయి. అంతేకాదు అందులో ఆ పాప పుట్టినప్పటి తేదీ..సమయం..జాతకం వివరాలతో కూడిన చార్ట్ కూడా ఉంది. ఆ జాతకంలో ఈ చిన్నారి పుట్టిన తేదీ మే 25, అమ్మాయి పేరు గంగా అని పేర్కొన్నారు. ఆమె మే 25 న జన్మించింది. అంటే, ఆ శిశువు వయస్సు మూడు వారాలు మాత్రమే. గుల్లు చౌదరి ఆ పసిబిడ్డను వరప్రసాదంగా భావించి ఇంటికి తీసుకువెళ్ళారు. ఆ పసిపాపను పెంచుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుకున్నారు. అయితే, అక్కడి స్థానికులు ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ పసిపాప గంగను తమతో తీసుకుని వెళ్లి.. ఆశా జ్యోతి కేంద్రంలో ఉంచారు. అక్కడ గంగకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందని నిర్ధారించారు. ప్రస్తుతం, గంగానదిలో దొరకిన ఈ నవజాత ప్రాంతం చర్చనీయాంశంగా మారింది. వైద్య పరీక్షలు పూర్తి చేసిన పోలీసులు బాలిక కుటుంబ సభ్యుల కోసం వెతుకుతున్నారు. కొన్ని మూఢనమ్మకాలు లేదా తాంత్రిక కర్మలను నెరవేర్చడానికి ఇలా చేసి ఉంటారని భావిస్తున్నారు. వేరే విధంగా అయితే కనుక ఇటువంటి పిల్లలను అలానే వదిలేసి వెళ్ళిపోతారు. కానీ, ఈ పాప బ్రతికి ఉండాలనీ, ఆమె ఎవరికైనా దొరికాలనీ లేదా గంగమ్మ..దేవతలు ఆ పాపను సంరక్షిస్తాయని మూఢ నమ్మకంతోనూ ఇలా చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Also Read: VIRAL VIDEO : పొదల్లో నక్కిన పులి మాటువేసి జింకపై దాడి..! మామూలుగా లేదు పులి వేట.. వైరల్ వీడియో..

PAN CARD : పాన్ కార్డుపై కనిపించే సంఖ్యల గురించి మీకు తెలుసా..? దీనికి సంబంధించి ప్రతి విషయం కచ్చితంగా తెలుసుకోవాలి..

Click on your DTH Provider to Add TV9 Telugu