చిరాగ్ పాశ్వాన్ ‘ప్రతీకారం’ ! కజిన్, రెబెల్ నేత ప్రిన్స్ రాజ్ పై సరికొత్త ఆరోపణ…. పశుపతి కుమార్ పరాస్ పై కూడా !

తనను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి తమను తాము లోక్ జన శక్తి పార్టీ నేతలుగా చెప్పుకున్న రెబెల్ నేతల్లో ముఖ్యంగా ఒకరిపై చిరాగ్ పాశ్వాన్ 'దాడి' మొదలుపెట్టారు.

చిరాగ్ పాశ్వాన్ 'ప్రతీకారం' ! కజిన్, రెబెల్ నేత ప్రిన్స్ రాజ్ పై సరికొత్త ఆరోపణ.... పశుపతి కుమార్  పరాస్ పై కూడా !
Ljp Rebel Party Mps Name Cr
Umakanth Rao

| Edited By: Phani CH

Jun 16, 2021 | 2:24 PM

తనను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి తమను తాము లోక్ జన శక్తి పార్టీ నేతలుగా చెప్పుకున్న రెబెల్ నేతల్లో ముఖ్యంగా ఒకరిపై చిరాగ్ పాశ్వాన్ ‘దాడి’ మొదలుపెట్టారు. తన కజిన్ అయిన ప్రిన్స్ రాజ్..పార్టీకి చెందిన ఓ మహిళా నాయకురాలితో సంబంధం పెట్టుకున్నాడని, ఆ తరువాత ఆమె అతడిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించిందని ఆయన చెప్పారు. బీహార్ లోని సమస్తిపూర్ నుంచి ఎన్నికైన ఈ ఎంపీ (ప్రిన్స్ రాజ్) నిర్వాకం గురించి తనకు తెలియగానే పోలీసులకు ఫిర్యాదు చేయవలసిందిగా సూచించానని, పైగా తన అంకుల్ అయిన పశుపతి కుమార్ పరాస్ కి కూడా చెప్పానని ఆయన తెలిపాడు. కానీ తన అంకుల్ ఏ మాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు., పశుపతి కుమార్ మా కుటుంబ పెద్ద.. అలాంటిది ఆయన ఈ విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటారని, కుటుంబ పరువు దిగజారిపోకుండా చూస్తారని ఆశించాను అని చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. ప్రిన్స్ రాజ్ సెక్స్ స్కాండల్ గురించి గత మార్చి 29 నే లేఖ రాశానన్నారు. రాజ్ తనను లైంగికంగా లోబరచుకున్నారని ఆ మహిళ ఆయనపై ఆరోపణలు మోపినట్టు తెలుస్తోంది.

దివంగత రామ్ విలాస్ పాశ్వాన్ సోదరుడైన రామచంద్ర పాశ్వాన్ కుమారుడే ప్రిన్స్ రాజ్.(రామచంద్ర పాశ్వాన్ కూడా మరణించారు). తన తండ్రి మృతి తరువాత ప్రిన్స్ రాజ్ సమస్తిపూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇలాఉండగా లోక్ జనశక్తి పార్టీలో నాయకత్వ పోరు ప్రారంభమైంది. తమదే అసలైన పార్టీ అని ఇటు చిరాగ్ పాశ్వాన్, అటు పశుపతి కుమార్ పరాస్ చెప్పుకుంటున్నారు. తనను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించే అధికారం ఈ రెబెల్ ఎంపీలకు లేదని చిరాగ్ పాశ్వాన్ అంటున్నారు. నేనే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశానని ఆయన చెబుతున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Road Accident: రాయదుర్గం వద్ద రోడ్డు ప్రమాదం… రోడ్డు దాటున్న యువతిని ఢీ కోట్టిన టూ వీలర్..

Pawan Kalyan: ప‌వ‌ర్ వాయిస్‌తో ఫోక్ సాంగ్ పాడ‌బోతున్న ప‌వ‌న్.. ఈసారి అభిమానుల‌కు మ‌రో స్పెష‌ల్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu