AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రచారంలో సినిమా డైలాగులతో ప్రజలను రెచ్చగొడతారా ..? నటుడు మిథున్ చక్రవర్తిని విచారిస్తున్న కోల్ కతా పోలీసులు

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి తన సినిమా డైలాగులతో ప్రజలను రెచ్చగొట్టారంటూ వచ్చిన ఫిర్యాదుపై కోల్ కతా పోలీసులు ఆయనను బుధవారం విచారించారు.

ప్రచారంలో సినిమా డైలాగులతో ప్రజలను రెచ్చగొడతారా ..?  నటుడు మిథున్ చక్రవర్తిని విచారిస్తున్న కోల్ కతా పోలీసులు
Kolkata Police Interrogate
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Jun 16, 2021 | 3:08 PM

Share

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి తన సినిమా డైలాగులతో ప్రజలను రెచ్చగొట్టారంటూ వచ్చిన ఫిర్యాదుపై కోల్ కతా పోలీసులు ఆయనను బుధవారం విచారించారు. ఈ విచారణకు ఆయన వర్చ్యువల్ గా హాజరయ్యారు. తాను నటించిన కొన్ని బెంగాలీ చిత్రాల్లోని డైలాగులను మిథున్ చక్రవర్తి….ప్రచారం సందర్భంగా వాడారని, అవి రెచ్చగొట్టేట్టుగా ఉన్నాయంటూ బెంగాలీ సినీ పరిశ్రమకే చెందిన ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖాకీలు దీన్ని ఆ తరువాత ఎఫ్ ఐ ఆర్ గా మార్చారు. అయితే ఇందులో తన తప్పు లేదని, ఈ ఎఫ్ ఐ ఆర్ ని కొట్టివేయాలని కోరుతూ మిథున్ కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కానీ పోలీసులకు సహకరించాలని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారు అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వాలని కోర్టు ఆయనను ఆదేశించింది. దీనిపై ..మిథున్.. ఈ డైలాగులు తనవి కావని, కొన్ని బెంగాలీ చిత్రాల్లోనివని పోలీసులకు చెప్పారు. ఇందులో తనకు దురుద్దేశాలు ఆపాదించవద్దని కోరారు. చిత్రాల లోని సంభాషణలతో ప్రజలను రెచ్చగొట్టగలమా అని ఆయన ప్రశ్నించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ చాలాసేపు కొనసాగింది.

బెంగాల్ ఎన్నికల్లో మిథున్ ముఖ్యంగా నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువెందు అధికారి తరఫున ప్రచారం చేశారు.. ఆ సందర్భంగా తన సినీ డైలాగులతో ఓటర్లను ఆకట్టుకున్నారు. ఆ నియోజకవర్గ ఎన్నికల్లో సువెందు అధికారి స్వల్ప తేడాతో సీఎం, తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీపై నెగ్గారు. కాగా ఈ కేసు విచారణను కలకత్తా హైకోర్టు ఈ నెల 18 కి వాయిదా వేసింది.

మరిన్ని ఇక్కడ చూడండి: RadheShyam Movie: ‘రాధేశ్యామ్’ మూవీతో ప్రభాస్ మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడా ?

Post Office Jobs: పోస్టల్‌ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తుల గడువు పొడిగింపు.. అర్హత 10వ తరగతి

ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..