ఈటలది ఆత్మ గౌరవ పోరాటం కాదు.. కేవలం ఆస్తుల కోసం ఆరాటం.. విమర్శలు గుప్పించిన దాస్యం వినయ్

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ పార్టీలో చేరడంపై తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. తెలంగాణ కోసం ఏమీ చేయని పార్టీ లో...

ఈటలది ఆత్మ గౌరవ పోరాటం కాదు.. కేవలం ఆస్తుల కోసం ఆరాటం.. విమర్శలు గుప్పించిన దాస్యం వినయ్

మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ పార్టీలో చేరడంపై తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. తెలంగాణ కోసం ఏమీ చేయని పార్టీ లో ఈటల రాజేందర్ చేరారు. బీజేపీలో రాజేందర్ చేరడాన్ని తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈటలది ఆత్మ గౌరవ పోరాటం కాదు.. కేవలం ఆస్తుల కోసం ఆరాటం అని వినయ్ భాస్కర్ ఎద్దేవా చేశారు. ఆరేండ్ల క్రితమే ఈటెల బీజేపీలో చేరేందుకు స్క్రిప్ట్ రాసుకున్నారు. బీజేపీలో చేరినందుకు రాజేందర్ ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. పెట్రోలియం మంత్రి సమక్షంలో బీజేపీలో చేరిన ఈటల పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించమని అడగలేదెందుకు..? అని వినయ్ భాస్కర్ ప్రశ్నించారు.

కమ్యూనిస్టునని చెప్పుకుంటూ ఈటెల బీజేపీలో ఎలా చేరుతారని ఎమ్మెల్సీ ఎం .శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. ఈటల రాజేందర్‌కు దక్కినంత ప్రాధాన్యత టీఆర్‌ఎస్ పార్టీలో మరెవ్వరికీ దక్కలేదన్నారు. తెలంగాణపై అయిష్టత తోనే ఈటెల బీజేపీలో చేరారన్నారు.

ఇవి కూడా చదవండి : Smoke in Intercity Train: ఇంటర్‌ సిటీ రైలు ఇంజిన్‌లో పొగలు.. ఆందోళనలో ప్రయాణికులు..

రెండేళ్ల బుజ్జోడికి భద్రత.. 24×7 కంటికి రెప్పలా కాపాడుతున్న గుజరాత్‌ పోలీసులు

Violating Covid Rules: కరోనా సమయంలో నిర్మల్ జిల్లా అధికారుల విందు.. నిబంధనల ఉల్లంఘనపై స్థానికుల ఆగ్రహం

Petrol Diesel Price: వాహనదారులకు చుక్కలు.. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధర..