అయ్యో రామా..! దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఓటు కోసం కోటి తిప్పలు. అందుకే.. ఓట్ల ఆటలో కొత్తకొత్త వెర్షన్స్‌ పుట్టుకొస్తున్నాయి. అందితే జుట్టు పట్టుకోవడం.. పొట్టుపొట్టు తిట్టుకోవడం.. అందకపోతే దారి మార్చి.. గుళ్లో దూరి దేవుడి కాళ్లు పట్టుకోవడం.. అవసరాన్ని బట్టి దేవుడి మీదే ఒట్టేసి జనం సెంటిమెంట్‌తోనే గేమ్స్ ఆడుకోవడం. ప్రస్తుతానికి దేవుడి చుట్టూనే చక్కర్లు కొడుతోంది తెలుగు రాజకీయం. దీనికి పరాకాష్ట ఏంటంటే.. దేవుడినే అంపైర్‌గా పెట్టి జరుగుతున్న పొలిటికల్ ఫీట్లు.

అయ్యో రామా..! దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
Telangana Elections
Follow us

|

Updated on: Apr 26, 2024 | 9:54 PM

ఓటు కోసం కోటి తిప్పలు. అందుకే.. ఓట్ల ఆటలో కొత్తకొత్త వెర్షన్స్‌ పుట్టుకొస్తున్నాయి. అందితే జుట్టు పట్టుకోవడం.. పొట్టుపొట్టు తిట్టుకోవడం.. అందకపోతే దారి మార్చి.. గుళ్లో దూరి దేవుడి కాళ్లు పట్టుకోవడం.. అవసరాన్ని బట్టి దేవుడి మీదే ఒట్టేసి జనం సెంటిమెంట్‌తోనే గేమ్స్ ఆడుకోవడం. ప్రస్తుతానికి దేవుడి చుట్టూనే చక్కర్లు కొడుతోంది తెలుగు రాజకీయం. దీనికి పరాకాష్ట ఏంటంటే.. దేవుడినే అంపైర్‌గా పెట్టి జరుగుతున్న పొలిటికల్ ఫీట్లు. అయోధ్య రామయ్యతో మొదలు పెడితే గ్రామ దేవుళ్ళ వరకూ.. ఇక్కడ ఎవ్వరికీ మినహాయింపుల్లేవు. పొట్టుపొట్టు తిట్టుకుంటూ.. తిట్లతోనే ఓట్లు కురుస్తాయన్న భ్రమల్లోనే బతికేసిన రాజకీయాలోళ్లు ఆ రొటీన్ ఫీట్లతో బోరెత్తిపోయి అలసితి-సొలసితి అంటూ అంతర్యామి చెంతకు చేరుకోవడం.. దేవుడి మీద ఒట్లేసి జనంలోని డివైన్ సెంటిమెంట్‌ను మేల్కొలిపి.. ఆ విధంగా శాటిస్‌ఫ్యాక్షన్లు పొందడం కామన్. ఇప్పుడైతే వీళ్లు ఒట్లతో పోటెత్తడం చూస్తుంటే.. దేవుడి మీద డిపెండెన్సీలు బాగా ఎక్కువైపొయ్యాయా అనేవి మనకొచ్చే డౌట్లు.

దేవుడే దిక్కు అంటూ పరమాత్ముడి చుట్టూ పొలిటికల్ పార్టీలు ప్రదక్షిణలు చేయడం కొత్త కాదు. అప్పుడప్పుడూ అందరూ చేసేవే. ఇప్పుడైతే ఆరు గ్యారంటీల సీజన్‌లో ఆరు పుణ్యక్షేత్రాల దగ్గర ఒట్టేసి మళ్లీ ఎన్నికల పరీక్షకు దిగిన సీఎం రేవంత్‌రెడ్డి.. యమా ట్రెండింగ్‌లోకొచ్చేశారు. సబ్జెక్టు-పంద్రాగస్టున రైతు రుణమాఫీ.. గ్యారంటీ నాది.. సాక్ష్యం మాత్రం దేవుళ్లు. అవతలి పార్టీ నేతల్ని, ముఖ్యంగా గులాబీ దళపతి కేసీఆర్‌ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి.. తిట్ల దండకాన్ని పీక్స్‌లోకి తీసుకెళ్లి.. అంతకంటే పైకి ఎక్కలేక.. ఎక్కి తొక్కడానికి ఏమీ లేక.. కిందకి దిగొచ్చేరా అనిపించింది నిన్నమొన్నటి రేవంత్‌రెడ్డి తీరు. కొడంగల్‌లో కార్యకర్తలతో మీటింగప్పుడు.. ఆయన మాటల్లో డిఫెన్స్‌ గేమేగా స్పష్టంగా కనిపించింది..? స్పీడ్ థ్రిల్స్- బట్ కిల్స్.. దూకుడు తగ్గించుము.. ఆగి-చూసి నడుపుము… అని ఎవరైనా చెప్పారా లేక.. తనకు తానే జ్ఞానోదయం చేసుకున్నారా..? ఏదైతేనేం.. ఇప్పుడు ద్యావుడా అంటూ గుళ్లూ… గుళ్లో దేవుళ్లమీదే రేవంత్‌రెడ్డి పూర్తి కాన్‌సన్‌ట్రేషన్.

నాలుగైదు నెలల ముందే ఎన్నికలు.. దొరికిన వాళ్లందరి కాళ్లూ మొక్కి ఓట్లడుక్కుని కష్టపడ్డ జ్ఞాపకాలు ఇంకా చెదిరిపోనే లేదు.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలొచ్చి నెత్తిన పడితే ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో తెలంగాణలో ఆ మూడు పార్టీల నాయకుల మొహాల్లో కనిపిస్తోంది. రూలింగ్ పార్టీనైతే ఆరు గ్యారంటీల భూతం వెంటాడుతోందా? ఓటర్లలో విశ్వసనీయత తగ్గుతుందేమో అనే ఫికర్‌ని పెంచుతోందా? ఈ ఒత్తిడి ఫలితమే.. ఇలా ప్రమాణాలకు దారితీస్తోందా? గాడ్‌ ఈజ్ గ్రేట్ అనుకుంటూ దేవుళ్లు సినిమా చూపిస్తున్నారా? మొక్కినచోట మొక్కకుండా గ్రామదేవతల్ని కూడా ఒగ్గేదే లే అంటూ ప్రామిస్‌ల మీద ప్రామిస్‌లు చేస్తున్నారా? ఒక్కోచోటైతే సిట్యువేషన్ డిమాండ్ చేస్తే.. దేవుడిపై ఒట్లు.. బోనస్‌గా జీవుడిపై తిట్లు కూడా. డబుల్ డోస్ అన్నమాట.

ఇవి కూడా చదవండి

జనంలో దేవుడి సెంటిమెంట్‌ను ఎంత కదిలించారో ఏమో గానీ.. ఓట్ల కోసమే ఈ ఒట్ల రాజకీయం.. అనే విమర్శలకైతే దొరికిపోతోంది రేవంత్ సర్కార్. రేపటిరోజున నీ ఒట్లు తీసి గట్టున పెడితే.. ఆనక మా దేవుళ్లేమవ్వాలె.. అనే రివర్స్ సెంటిమెంట్లు కూడా లేకపోలేదు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చెయ్యలేక.. ప్రజల్లో చులకనైపోయి.. వ్యతిరేకత మూటగట్టుకుని, దాన్నుంచి తప్పించుకోడానికి, లోక్‌సభ ఎన్నికల్లో కొత్తగా లబ్ది పొందడానికే రేవంత్‌రెడ్డి ఇలా గుడి బాట పట్టారా… అనేవి అపోజిషన్‌ సైడ్ నుంచి వినబడే రెడీమేడ్‌ సందేహాలు. అధికార పార్టీలో అభద్రతాభావం పెరిగిందా… అందుకే ఇలా జనంలో ఆధ్యాత్మిక భావన మీద ఆధారపడుతోందా.. అనే సందేహాలు ఇలా ఉండగానే.. ప్రమాణాల సీజన్‌ కొత్త మలుపు తిరిగింది. పంద్రాగస్టున జరగబోయే రుణమాఫీపై తెలంగాణ అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం రా అంటూ గన్‌పార్క్‌ వైపు టర్న్ ఇచ్చుకున్నాయి పార్టీలు. బాసర సరస్వతిపై ఒట్టేసి ఒకసారి, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిపై మరోసారి, జోగులాంబ సాక్షిగా.. ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా.. భద్రాద్రి రామయ్య సాక్షిగా.. రామప్ప-శివుడి సాక్షిగా… ఇలా అన్ని గుళ్లూ ఓ రౌండెయ్యడం ఐపోయిందనుకున్నారో ఏమో.. గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపం దాకా నడిచొచ్చింది రాజకీయ నాయకుల ఒట్లు, ప్రమాణాల పర్వం. సెంటిమెంట్‌ బాబూ సెంటిమెంట్.. ఎప్పుడే సెంటిమెంట్‌ వర్కవుటౌతుందో ఎవ్వరికెరుక?

మరిన్ని తెలంగాణ వార్తల కోెసం  ఇక్కడ క్లిక్ చేయండి…

Latest Articles
ఇక ఐదు రోజులే పనిదినాలు.. బ్యాంకు ఉద్యోగులకు బంపర్ ఆఫర్..
ఇక ఐదు రోజులే పనిదినాలు.. బ్యాంకు ఉద్యోగులకు బంపర్ ఆఫర్..
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర టీ తాగండి.. ఎందుకంటే?!
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర టీ తాగండి.. ఎందుకంటే?!
అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..
సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
మీ ఫోన్లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
మీ ఫోన్లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
Horoscope Today: ఆ రాశి వారు సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి..
Horoscope Today: ఆ రాశి వారు సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి..
ప్రధాని మోడీని కలిసిన పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు.. కారణమిదే
ప్రధాని మోడీని కలిసిన పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు.. కారణమిదే
సంజూ శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం
సంజూ శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం
ప్రేమలో ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు.? షాహిద్ కపూర్ వీడియో.
ప్రేమలో ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు.? షాహిద్ కపూర్ వీడియో.