హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..

హైదరాబాదులో ఎప్పుడు ఐపీఎల్ మ్యాచ్ జరిగినా టికెట్ల కొరత కనిపిస్తుంది. ఇప్పటివరకు హైదరాబాదులో మూడు ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. ఈ మూడు మ్యాచ్లకు టికెట్లు దొరకక క్రికెట్ అభిమానులు చాలామంది నిరాశతో ఉన్నారు. అయితే టికెట్లు దొరకకపోవటంపై అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
Ipl Tickets
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Srikar T

Updated on: Apr 26, 2024 | 4:06 PM

హైదరాబాదులో ఎప్పుడు ఐపీఎల్ మ్యాచ్ జరిగినా టికెట్ల కొరత కనిపిస్తుంది. ఇప్పటివరకు హైదరాబాదులో మూడు ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. ఈ మూడు మ్యాచ్లకు టికెట్లు దొరకక క్రికెట్ అభిమానులు చాలామంది నిరాశతో ఉన్నారు. అయితే టికెట్లు దొరకకపోవటంపై అటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. టికెట్ విక్రయాలు మొత్తం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‎తో సంబంధం లేకుండానే పేటీఎం విక్రయాలు జరుగుతుంది. అయితే మ్యాచ్‎కు కొద్ది రోజుల ముందు మాత్రమే ఆన్లైన్లో టికెట్ విక్రయాలు పేటీఎం జరుపుతుంది. ఆన్లైన్లో పెట్టిన పది నిమిషాలకే టికెట్లు అన్నీ సోల్డ్ అవుట్ బోర్డు పెట్టేస్తున్నారు. దీంతో క్రికెట్ అభిమానులకు టికెట్లు దొరకక ఇక్కట్లు మొదలయ్యాయి. ఆన్లైన్లో పెట్టిన కొద్దిసేపటికే టికెట్లు ఎలా అయిపోతున్నాయి అనేదానిపై ఇప్పటివరకు అనేక రకాల వాదనలు వినిపించాయి. మొదట టికెట్లు విక్రయాలను హెచ్‎సీఏనే కావాలని బ్లాక్ చేస్తుందని ఆరోపణలు వినిపించాయి. కానీ టికెట్ విక్రయాలతో హెచ్‎సీఏకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే ప్రెసిడెంట్ ప్రకటించారు. మరోవైపు పేటీఎం నిర్వాహకులు సైతం క్రికెట్ మ్యాచ్‎కు ఉన్న క్రేజ్ కారణంగా త్వరితగతిన టికెట్లు సోల్డ్ అవుట్ అయిపోతున్నాయని పేటీఎం నిర్వహకులు ప్రకటించారు. మరి పెట్టిన టికెట్లన్నీ ఏమైపోతున్నాయి అనే విషయంపైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో కీలక విషయాలు బయటపడ్డాయి.

హైదరాబాద్‎కు చెందిన ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఆన్లైన్లో పెట్టిన కొద్దిసేపటికే 1000కి పైగా టికెట్లను విక్రయిస్తున్నారు. అయితే ఐపీఎల్ నిబంధనల ప్రకారం కేవలం ఒక వ్యక్తికి నాలుగు లేదా ఆరు టికెట్లు మాత్రమే విక్రయించడానికి వీలుంటుంది. కానీ వీరు అక్రమ దారిలో పేటీఎం నిర్వాహకుల ఐడి పాస్వర్డ్ పొంది ఇష్టానుసారంగా తక్కువ సమయంలోనే 1000 టికెట్లకు పైగా విక్రయాలు జరిపారు. దీంతో మిగతా వారికి టికెట్లు కొనే అవకాశం లేకుండా పోయింది. విక్రయానికి పెట్టిన కొద్ది గంటల్లోనే సోల్డ్ అవుట్ బోర్డు పెట్టేస్తున్నారు. అలా ఆన్లైన్లో టికెట్లను విక్రయించిన వారు క్యూఆర్ కోడ్ తీసుకొని హైదరాబాద్లోని జింఖానా గ్రౌండ్‎కు వెళ్తారు. అక్కడ క్యూఆర్ కోడ్ తీసుకొని వీరి చేతికి టికెట్లు ఇచ్చేస్తారు. వీరికి వచ్చిన టికెట్లను క్యాష్ చేసుకోవడానికి ఆన్లైన్లో తిరిగి అధిక రేట్లకు టికెట్లను విక్రయిస్తున్నారు. అలా మొత్తం వీరి వద్ద నుండి 100కు పైగా టికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్ వేదికలుగా ఉన్న వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఐపీఎల్ టికెట్ల ప్రకటనలు ఇస్తూ పోలీసులకు దొరికిపోయారు. ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు వీరికి గతంలోనూ బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్మిన కేసులో చెన్నై పోలీసులు అరెస్ట్ చేసినట్లు గుర్తించారు. అరెస్ట్ అయిన ఇద్దరిలో ఒక వ్యక్తి బెంగళూరుకు చెందిన వాసిగా గుర్తించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోెసం  ఇక్కడ క్లిక్ చేయండి…

ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఆరోగ్య ప్రయోజనాలెన్నో..!
ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఆరోగ్య ప్రయోజనాలెన్నో..!
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం