Babu Mohan: కేఏ పాల్‌కు బాబూ మోహన్ ఝలక్.. ఇదేం ట్విస్ట్‌రా బాబోయ్

వరంగల్ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు బబూ మెహన్ నామినేషన్ వేశారు. ప్రజాశాంతి పార్టీ నుంచి ఆయన బరిలో ఉంటారని అంతా భావించగా.. ఆయన ఆ పార్టీ తరపున కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచారు. పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Babu Mohan: కేఏ పాల్‌కు బాబూ మోహన్ ఝలక్.. ఇదేం ట్విస్ట్‌రా బాబోయ్
Babu Mohan
Follow us

|

Updated on: Apr 26, 2024 | 2:22 PM

మాజీ మంత్రి, సినీనటుడు బాబూమోహన్‌ వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గురువారం నామినేషన్‌ వేశారు. మధ్యాహ్నం వరంగల్‌ రిటర్నింగ్‌ అధికారి ఆఫీసుకు చేరుకున్న ఆయన నడుము నొప్పితో ఇబ్బంది పడగా.. స్టాఫ్ వీల్‌ఛైర్‌ ఏర్పాటు చేసి లోనికి పంపారు. రిటర్నింగ్‌ ఆఫీసర్ ప్రావీణ్యకు నామినేషన్‌ పత్రాలు అందజేశారు బాబుమోహన్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. కేఏ పాల్‌ ప్రజాశాంతి పార్టీ నుంచి నామినేషన్‌ వేస్తారనే ప్రచారం జరిగిందని మీడియా మిత్రులు ప్రశ్నించగా.. . బీజేపీ నుంచి బయటకు వచ్చాక.. కేఏ పాల్‌ కాఫీకి రమ్మంటే వెళ్లానని, అక్కడ పాల్‌ తనకు కండువా కప్పి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఇచ్చారని వెల్లడించారు. తాను ఎలాంటి పార్టీ సభ్యత్వం తీసుకోలేదని, అదే రోజు ఆ పార్టీకి గుడ్ బై చెప్పానట్లు వివరించారు. వరంగల్‌లో కొందరు ఫాలోవర్స్ కోరిక మేరకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్‌ వేశానట్లు తెలిపారు.

కాగా, గత తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బాబూ మోహన్ బీజేపీ తరపున ఆందోల్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. అనంతరం వరంగల్ స్థానం నుంచి BJP టికెట్ ఆశించినా.. హైకమాండ్ అందుకు నిరాకరించింది. దీంతో బీజేపీపై తీవ్ర విమర్శలు చేసి.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత ప్రజాశాంతి పార్టీ నుంచే బరిలో ఉంటారని అందరూ భావించారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. నామినేషన్ల చివరి రోజు ఆయన వరంగల్ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.