ఇంటర్ పాసైనందుకు స్నేహితులకు పార్టీ.. బైక్‌పై వస్తుండగా బస్సు ఢీకొని ..
ఇంటర్ పాసైన ఆనందంలో తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకోవాలనుకున్నాడు. మిత్రులంతా ఓ చోట కలిసి సంతోషంగా గడిపారు. అనంతరం ముగ్గురూ ఒకే బైక్‌పై ఇంటికి బయలుదేరారు. అంతలోనే ఘోరం జరిగిపోయింది. రోడ్డు ప్రమాదం రూపంలో నలుగురు స్నేహితులూ అనంతలోకాలకు చేరిపోయారు. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్మీడియట్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు.

పోలీసుల కథనం ప్రకారం.. వర్ధన్నపేటకు చెందిన పొన్నం గణేశ్, ఇల్లందకు చెందిన మల్లెపాక సిద్ధు, వరుణ్‌తేజ్, పొన్నాల అనిల్ కుమార్ ఒకే బైక్‌పై ఇల్లంద నుంచి వర్ధన్నపేటకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో విద్యార్థి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బుధవారం వెల్లడైన ఇంటర్ ఫలితాల్లో పాసైన గణేశ్.. తన ముగ్గురు స్నేహితులతో కలిసి సాయంత్రం పార్టీ చేసుకుని తిరిగి ఒకే బైక్‌పై ఇంటికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంతో వర్ధన్నపేట, ఇల్లందలో విషాదఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బైక్, బస్సు రెండూ అతివేగంగా వెళ్తుండడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..