AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం..

మాటకు మాట.. విమర్శకు ప్రతివిమర్శ.. ఎత్తుకు పైఎత్తుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల రణరంగంలో దూసుకెళ్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో కనీసం 12 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తు అభ్యర్థుల కోసం ప్రచారం చేయడమే కాకుండా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో రేవంత్ రెడ్డి సఫలీకృతులవుతున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Telangana: దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం..
Cm Revanth Reddy
Prabhakar M
| Edited By: Ram Naramaneni|

Updated on: Apr 27, 2024 | 6:30 AM

Share

మాటకు మాట.. విమర్శకు ప్రతివిమర్శ.. ఎత్తుకు పైఎత్తుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల రణరంగంలో దూసుకెళ్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో కనీసం 12 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తు అభ్యర్థుల కోసం ప్రచారం చేయడమే కాకుండా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టడంలో రేవంత్ రెడ్డి సఫలీకృతులవుతున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. వాటికి ముఖ్యమంత్రి కూడా ధీటుగా సమాధానం ఇస్తున్నారన్న అభిప్రాయం సర్వత్రా కలుగుతోంది. ఆ పార్టీ నాయకులు విసిరే సవాళ్లను కూడా ముఖ్యమంత్రి స్వీకరిస్తుండడం గమనార్హం. ఉదాహరణకు, ఆగస్టు 15లోగా రుణ మాఫీ చేస్తామని ఇటీవల సీఎం చేసిన ప్రకటన క్రమంలో.. ఆలోగా రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు సవాలు చేశారు. ఆ సవాలును స్వీకరించిన రేవంత్ రెడ్డి.. రాజీనామా పత్రాన్ని సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. చివరికి శుక్రవారం నాడు హరీష్ రావు అమరవీరుల స్థూపం వద్ద తన రాజీనామా పత్రాన్ని ప్రదర్శించారు.

మరోవైపు, బీజేపీపై కూడా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ దాడికి వెనుకాడడం లేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలను సైతం తీవ్రంగా విమర్శిస్తున్నారు. ముస్లీం రిజర్వేషన్లను తొలగిస్తామని సిద్దిపేటలో అమిత్ షా చేసిన ప్రకటనను సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా తిప్పికొట్టారు. బీజేపీ రిజర్వేషన్లను రద్దు చేయడానికి కుట్ర చేస్తోందని ఆరోపించి.. ఆ పార్టీని ఇరుకున పెట్టారు. అంతేకాకుండా, బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని అభివర్ణించడమే కాకుండా ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలో దోచుకోడానికి బీజేపీ కీలక నేతలు వస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో గత పదేళ్ల బీజేపీ పాలనలో తప్పిదాలు, ప్రజావ్యతిరేక నిర్ణయాలు, తెలంగాణకు ఏమి చేయకపోవడాన్ని ఎత్తిచూపుతూ బీజేపీపై చార్జిషీటు కూడా విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి

రాజకీయంగా ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే సహించేది లేదన్న సంకేతాన్ని రేవంత్ రెడ్డి పంపిస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విమర్శలు, ఆరోపణలకు గట్టిగా సమాధానం చెప్పకపోతే ఎన్నికల సమయంలో పార్టీ నష్టపోయే అవకాశాలు ఉంటాయని సీఎం భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అందువల్ల ఇతర పార్టీలు చేస్తున్న విమర్శలను గట్టిగా తప్పింకొట్టే విషయంలో పార్టీ నాయకులకు కూడా రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోెసం  ఇక్కడ క్లిక్ చేయండి…