Watch Video: ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ ఇటలీ నేషనల్ కాంగ్రెస్‌గా మారిపోయిందని ఆరోపించారు. బీజేపీ పక్కా లోకల్ పార్టీ అని.. కాంగ్రెస్ పక్కా ఇటలీ పార్టీ అని కామెంట్ చేశారు. బీజేపీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ ఇటలీ నేషనల్ కాంగ్రెస్‌గా మారిపోయిందని ఆరోపించారు. బీజేపీ పక్కా లోకల్ పార్టీ అని.. కాంగ్రెస్ పక్కా ఇటలీ పార్టీ అని కామెంట్ చేశారు. బీజేపీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ముస్లిం రిజర్వేషన్లను కాంగ్రెస్ ఏ ప్రాతిపదికన తీసుకొచ్చిందో చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముస్లింలను బీసీల్లో చేర్చి బీసీలకు కాంగ్రెస్ తీవ్రమైన అన్యాయం చేస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేయాలని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణలో బీసీలకు అన్యాయం చేస్తోంది ఎవరో కాంగ్రెస్ పార్టీ చెప్పాలన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లీం రిజర్వేషన్లను తీసేస్తుందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు. దీనిపై రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంపై నమ్మకం ఉంటే వెంటనే ముస్లీం రిజర్వేషన్లను రద్దు చేయాలని సవాల్ విసిరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోెసం ఇక్కడ క్లిక్ చేయండి…
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

