Watch Video: ‘పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు’.. నాగబాబు కీలక ఆరోపణలు..
పిఠాపురంలో జనసేన అధినేత ఓటమి కోసం వైసీపీ నేతలు పావులు కదుపుతున్నట్లు కీలక ప్రకటన చేశారు నాగబాబు. పవన్ కళ్యాణ్ ఓటమి కోసం మిథున్ రెడ్డి, దాడిశెట్టి రాజాలు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్కి వస్తున్న ఆదరణ చూసి పరాయజయం సాధ్యం కాదని తెలిసిందన్నారు. అందుకే స్థానికేతరులను పిలిపించి దాడికి పాల్పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానికుల నుంచి వచ్చిన సమాచారం అన్నారు.
పిఠాపురంలో జనసేన అధినేత ఓటమి కోసం వైసీపీ నేతలు పావులు కదుపుతున్నట్లు కీలక ఆరోపణలు చేశారు నాగబాబు. పవన్ కళ్యాణ్ ఓటమి కోసం మిథున్ రెడ్డి, దాడిశెట్టి రాజాలు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్కి వస్తున్న ఆదరణ చూసి పరాయజయం సాధ్యం కాదని తెలిసిందన్నారు. అందుకే స్థానికేతరులను పిలిపించి దాడికి పాల్పడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానికుల నుంచి వచ్చిన సమాచారం అన్నారు. ఇందుకోసం కడప నుంచి కొంతమంది గూండాలను, రౌడీలను పురమాయించినట్లు ఆరోపణలు చేశారు. ఎంతమంది వస్తారో రండి ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామన్నారు నాగబాబు. మీ ఇంటి నుంచి మా ఇళ్లు ఎంత దూరమో.. మా ఇంటి నుంచి మీ ఇల్లు కూడా అంతే దూరమని చెప్పారు. వీరిని ఎదుర్కొనేందుకు పిఠాపురం ప్రజలు కూడా సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు. కడప గూండాలను ఎదుర్కొనేందుకు తమ వద్ద ప్రత్యేక మెకానిజం ఉందని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..