AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Congress: అందుకేనా కర్ణాటక జపం..! తెలంగాణ కాంగ్రెస్‌లో ‘డీకే’ మంత్రం పనిచేస్తుందా..?

Telangana Congress News: తెలంగాణ కాంగ్రెస్ పై అధిష్టానం ఫుల్ ఫోకస్ చేసింది. కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ అవే ఫలితాలను ఇక్కడ రిపీట్ చేయాలని భావిస్తోంది. ఇందుకు కర్ణాటకలో అన్ని తానై నడిపించిన నేతకి తెలంగాణలో..

Telangana Congress: అందుకేనా కర్ణాటక జపం..! తెలంగాణ కాంగ్రెస్‌లో ‘డీకే’ మంత్రం పనిచేస్తుందా..?
Tpcc Dk Shivakumar
Follow us
Ashok Bheemanapalli

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jun 13, 2023 | 8:47 PM

Telangana Congress News: తెలంగాణ కాంగ్రెస్ పై అధిష్టానం ఫుల్ ఫోకస్ చేసింది. కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ అవే ఫలితాలను ఇక్కడ రిపీట్ చేయాలని భావిస్తోంది. ఇందుకు కర్ణాటకలో అన్ని తానై నడిపించిన నేతకి తెలంగాణలో కూడా క్రియాశీలకంగా వ్యవహరించేలా అగ్రనేత ప్రియాంక గాంధీ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తుంది. ఇంతకీ తెలంగాణలో తన సత్తా చాటాలని భావిస్తున్న ఆ నేత ఎవరు?.. ఏంటీ ఆలోచిస్తున్నారా..? అయితే ఈ హాట్ పొలిటికల్ స్టోరీ చదివేయండి. కర్ణాటక మాదిరిగా ప్రియాంక గాంధీ తెలంగాణ పై దృష్టిసారించారు. అక్కడి మాదిరి ఇక్కడ గెలవడానికి వ్యూహాలు పన్నుతున్నారు.. అక్కడ అన్ని తనై నడిపించిన కర్ణాటక డిప్యూటీ సీఎం, కేపీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ ఇక తెలంగాణలోనూ తన సత్తా చాటాలని చూస్తున్నారు.. రాహుల్, ప్రియాంక గాంధీ అండ, రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ఉన్న సాన్నిహిత్యంతో తెలంగాణలో అడుగుపెట్టాలని చూస్తున్నట్లు గాంధీ భవన్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే తను మార్కును చూపించిన డీకే.. తెలంగాణ పార్టీలో చేరికల నుండి గెలిచే అవకాశం ఉన్న స్థానాలు, అభ్యర్థుల ఎంపిక సునీల్ రిపోర్ట్ ఆధారంగా ఏఐసిసి పెద్దలతో కలిసి డీకే పరిశీలిస్తున్నట్లు సమాచారం..

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత డీకే వద్దకు టీకాంగ్రెస్ నేతలు క్యూ కట్టారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత వీహెచ్, మధుయాష్కి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలు, ఇతర కాంగ్రెస్ నేతలు డీకేని కలిసి వచ్చారు.. ఇటు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సైతం డీకే తో పలుమార్లు భేటీ అయ్యారు.. అప్పటి నుండే వైస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనం వార్తలు జోరందుకున్నాయి.

ఇక పార్టీలో చేరికలపైన కూడా డీకే దృష్టి సారించినట్లు తెలుస్తుంది.. సునీల్ నివేదికలో భాగంగా పొంగులేటి, జూపల్లి కృష్ణారావు, కూచుకుంట్ల దామోదర్ రెడ్డి లాంటి నేతలపై డీకే దృష్టి సారించారు.. వారు ఇప్పటికే డీకే తో కూడా భేటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. పార్టీలో చేరే నేతలకు టికెట్లతో పాటు భవిష్యత్ లో పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పిస్తునట్లు సమాచారం. కర్ణాటక ఎన్నికల మాదిరి నేతలంతా కలిసికట్టుగా పని చేయాలని డీకే తెలంగాణ నేతలకు సూచిస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.. అందుకే టీకాంగ్రెస్ నేతలు కర్ణాటక మంత్రాన్ని జపిస్తున్నట్లు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ జోరును పెంచింది. ఈ క్రమంలో కర్ణాటకలో అన్నీ తానై విజయ తీరాలకు చేర్చిన డీకే మంత్రం తెలంగాణలో పనిచేస్తుందా..? డీకే మాట విని నేతలు కలికట్టుగా పని చేస్తారా..? గ్రూపుల లొల్లి సద్దుమణుగుతుందా..? పార్టీ నేతల అభిప్రాయమేంటి..? ఇవన్నీ క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..