Andhra Pradesh: ఇంటర్ సంప్లిమెంటరీ పరీక్షలో ఫెయిల్.. మనస్తాపంతో విద్యార్థి ఆత్మహత్య..
పరీక్షల్లో ఫెయిలయ్యామని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఇటీవల విపరీతంగా పెరిగిపోతున్నాయి. భవిష్యత్తుపై సరైన అవగాహణ లేక.. ఎవరో ఏదో అనుకుంటారని.. ఫెయిలయ్యామని తెలిస్తే పరువు పోతుందనే మనస్తాపంతోనే కొంతమంది విద్యార్థులు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు.

పరీక్షల్లో ఫెయిలయ్యామని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఇటీవల విపరీతంగా పెరిగిపోతున్నాయి. భవిష్యత్తుపై సరైన అవగాహణ లేక.. ఎవరో ఏదో అనుకుంటారని.. ఫెయిలయ్యామని తెలిస్తే పరువు పోతుందనే మనస్తాపంతోనే కొంతమంది విద్యార్థులు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. మంగళవారం రోజున ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఇలా విడుదలయ్యాయో లేదో..పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడికి చెందిన రవి శంకర్ అనే విద్యార్థి మళ్లీ ఫెయిలయ్యాననే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
రాజమండ్రి కొవ్వురు వంతెనపై నుంచి గోదావరిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థి మృతదేహం గాలిస్తున్నారు. కొడుకు మృతి చెందాడనే వార్త తెలియడంతో రవి శంకర్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..