ఏంటా ధైర్యం.. ఏకంగా కలెక్టర్‌‎తోనే ఆటలా.. నకిలీ అకౌంట్ ఓపెన్ చేసి ఆపై..

సైబర్ కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు సోషల్ మీడియా వేదికగా సామాన్యులతో పాటు ప్రముఖులను కూడా బురిడీ కొట్టిస్తున్నారు. ఇప్పటివరకు సంస్థల పేరుతో ఫేక్ అకౌంట్‎లను క్రియేట్ చేసి దండుకుంటున్నారు. ఇటీవల సామాన్యుల నుంచి బ్యూరోక్రాట్ల వరకు ప్రతి ఒక్కరూ సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఏంటా ధైర్యం.. ఏకంగా కలెక్టర్‌‎తోనే ఆటలా.. నకిలీ అకౌంట్ ఓపెన్ చేసి ఆపై..
Hari Chandana
Follow us
M Revan Reddy

| Edited By: Srikar T

Updated on: May 26, 2024 | 7:04 PM

సైబర్ కేటుగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు సోషల్ మీడియా వేదికగా సామాన్యులతో పాటు ప్రముఖులను కూడా బురిడీ కొట్టిస్తున్నారు. ఇప్పటివరకు సంస్థల పేరుతో ఫేక్ అకౌంట్‎లను క్రియేట్ చేసి దండుకుంటున్నారు. ఇటీవల సామాన్యుల నుంచి బ్యూరోక్రాట్ల వరకు ప్రతి ఒక్కరూ సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారు. ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా కలెక్టర్ హరిచందన పేరుతో కేటుగాళ్లు నకిలీ ఫేస్ బుక్ అకౌంట్‎ను ఓపెన్ చేశారు. ప్రొఫైల్‎లో హరిచందన ఐఏఎస్ పేరుతోపాటు ఆమె గతంలో చేసిన సామాజిక కార్యక్రమాల ఫోటోలతో రూపొందించిన ఖాతాను ఓపెన్ చేశారు. హరిచందన ఐఏఎస్‌ పేరుతో కలిగిన ఖాతా నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపడంతో చాలామంది యాక్సెస్ట్‌ చేశారు. ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ ద్వారా చాటింగ్‌ చేస్తూనే వారి ఫోన్ నెంబర్లను తీసుకొని మరొక నంబరుతో వాట్సాప్‌ చేశారు. తాను మీటింగులో ఉన్నానని, అర్జంట్‌ అవసరం ఉందంటూ డబ్బులు దండుకునే ప్రయత్నం చేశారు.

కలెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి డబ్బులు అడగడం ఏంటని కొందరికి అనుమానం వచ్చింది. ఇది కేటుగాళ్ళ పని అయిఉండవచ్చని.. విషయాన్ని కలెక్టర్ హరి చందన దృష్టికి తీసుకువచ్చారు. తనకు ఫేస్‌బుక్‌ ఖాతా లేదని, అది ఫేక్‌ అకౌంట్‌ అయి ఉంటుందని కలెక్టర్ హరి చందన స్పష్టం చేశారు. ఈ ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ ను ఎవరు నమ్మిమోసపోవద్దని ఆమె కోరారు. ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్‎ను సృష్టించిన సైబర్ కేటుగాళ్లపై జిల్లా ఎస్పీ చందన దీప్తికి కలెక్ట్ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..