Illegal Gas Refilling: కూపీ లాగితే డొంక కదులుతోంది.. బయటపడ్డ అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ దందా..!
రాష్ట్ర ఖజానా నింపేందుకు సర్కార్ అన్ని రకాల ఆదాయ మార్గాలను అన్వేషిస్తుంటే, కొందరు కేటుగాళ్లు అడ్డుగోలు దందాలతో తూట్లు పొడుస్తున్నారు. హైదరాబాద్ మహానగరం శివారులో యథేచ్ఛగా అక్రమ గ్యాస్ దందా కొనసాగుతోంది. జనావాసాల మధ్య నిర్భయంగా అక్రమ గ్యాస్ రిఫిల్లింగ్ చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
రాష్ట్ర ఖజానా నింపేందుకు సర్కార్ అన్ని రకాల ఆదాయ మార్గాలను అన్వేషిస్తుంటే, కొందరు కేటుగాళ్లు అడ్డుగోలు దందాలతో తూట్లు పొడుస్తున్నారు. హైదరాబాద్ మహానగరం శివారులో యథేచ్ఛగా అక్రమ గ్యాస్ దందా కొనసాగుతోంది. జనావాసాల మధ్య నిర్భయంగా అక్రమ గ్యాస్ రిఫిల్లింగ్ చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా ఎస్‌వోటీ పోలీసులు జరిపిన దాడుల్లో అక్రమ దందా బండారం బయటపడింది.
ప్రస్తుత కాలంలో ప్రజల నిత్యావసరాలపై ఎవరికి నచ్చిన విధంగా వారు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న సంఘటనలు చాలానే చూస్తున్నాం. ఇదే క్రమంలో గ్యాస్ వినియోగంలో కూడా ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండడం కూడా ఎంతో ముఖ్యం. కానీ, కొందరు మాత్రం గ్యాస్ విషయంలో ఏ మాత్రం భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ దందా చేస్తూ కావల్సినోడికి కావాల్సినంత సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతి లేకుండా ఇలా అక్రమంగా రీఫిల్లింగ్ చేయడం చట్టరీత్యా నేరం అని అధికారులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా పెడచెవిన పెట్టేవారే ఎక్కువ అయ్యారు. డబ్బులకు ఆశ పడి ఇలాంటి అక్రమ చర్యలకు పూనుకుని దందా కొనసాగిస్తున్నారు.
తాజాగా హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతం జల్‌పల్లిలో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ దందా బయటపడింది. గో గ్యాస్ కమర్షియల్ సిలిండర్స్ నుంచి భారత్, ఇండేన్ సిలిండర్స్ లోకి మారుస్తూ సొమ్ము చేసుకుంటున్నారు కేటుగాళ్లు. జనావాసాల మధ్యే ఇలా ప్రమాదకరంగా అక్రమ దందా వ్యవహారం కొనసాగుతోంది. దీనిపై పక్కా సమాచారం అందుకున్న మహేశ్వరం ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేసి 100 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ దందాలకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పహాడీషరీఫ్ పోలీసులకు అప్పగించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..