Telangana: నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై పోలీసులు కొరడా.. మోసం చేస్తే ఏకంగా PD యాక్ట్ నమోదు..!

మోసాల్లో గల్ఫ్‌ ఏజెంట్ల మోసాలే వేరయా అన్నట్టు ఉంటాయి. ఊళ్లో ఉపాధి అవకాశాలు తక్కువ. వ్యవసాయం తప్ప మరో ఉపాధి ఉండదు. ఇదే వాడికి పెట్టుబడిగా మారింది. ఏజెంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్‌లో నరకయాతన పడుతోన్న అభాగ్యులు ఎంతోమంది.

Telangana: నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై పోలీసులు కొరడా.. మోసం చేస్తే ఏకంగా PD యాక్ట్ నమోదు..!
Police On Gulf Agents
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 26, 2024 | 1:37 PM

మోసాల్లో గల్ఫ్‌ ఏజెంట్ల మోసాలే వేరయా అన్నట్టు ఉంటాయి. ఊళ్లో ఉపాధి అవకాశాలు తక్కువ. వ్యవసాయం తప్ప మరో ఉపాధి ఉండదు. ఇదే వాడికి పెట్టుబడిగా మారింది. ఏజెంట్ల చేతిలో మోసపోయి గల్ఫ్‌లో నరకయాతన పడుతోన్న అభాగ్యులు ఎంతోమంది. లక్షల రూపాయలు దండుకుని, మాయ మాటలతో గల్ఫ్‌ పంపే ఏజెంట్ల మోసాలు ఒకెత్తయితే, అసలు గల్ఫ్‌ పంపకుండానే దోచేవారు మరికొందరు. కంపెనీ వీసాల పేరుతో కోట్ల రూపాయలు వసూలుచేసి పారిపోయే వారి ఇంకొందరు. ఒకర్నో ఇద్దర్నో కాదు ఏకంగా వందల మందిని నట్టేట ముంచేస్తున్నారు కేటుగాళ్ళు.

ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోలీసులు నకిలీ ఏజెంట్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా మోసాలకు పాల్పడుతున్న నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై సిరిసిల్ల ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సోదాలు నిర్వహించారు. 5 టీమ్‌లగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మూడు కేసులు నమోదు చేశారు. నకిలీ వీసాలు ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం వెళ్ళే వారిని మోసం చేస్తే PD యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు విస్తృతస్థాయి తనిఖీలు నిర్వహించారు.

నకిలీ గల్ఫ్ ఎజెంట్స్ విజిట్ వీసాలపై జిల్లాలో ఉన్న నిరుద్యోగులని టార్గెట్ చేస్తున్నారు. వారి నుండి అధిక మొత్తంలో డబ్బులు తీసుకుని మాయ మాటలు చెప్పి ఇక్కడి నుండి గల్ఫ్ దేశాలకి పంపిస్తారు. అక్కడికి అప్పులు చేసి వెళ్లిన తరువాత కంపెనీ వీసా కాదని తెలిసి దేశం కానీ దేశంలో ఎం చేయాలో తెలియక అష్ట కష్టాలు పడి స్వదేశానికి తిరుగు ప్రయాణం అవుతున్నారు. లేదంటే అక్కడే ఏదో చిన్న చితక కూలీ పని చేసుకుంటూ నరకయాతన అనుభవిస్తున్నారు. ఇలా ఏజెంట్ల చేతిలో మోసపోతున్న వారి సంఖ్య క్రమంలో పెరుగుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నకిలీ ఏజెంట్ల భరతం పడుతున్నారు.

అయితే ఎవరైతే ఏజెన్సీల లేదా ఏజెంట్ల చేతిలో మోసపోయారో వారు నేరుగా పోలీసులకు పిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామంటున్నారు జిల్లా ఎస్పీ. ఆ పిర్యాదులపై తగిన రీతిలో విచారణ జరిపి నేరం రుజువు అయితే సదరు ఏజెంట్‌పై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో గత సంవత్సరం 43 కేసులు ,ఈ సంవత్సరం 19 కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. నకిలీ వీసాలు ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం వెళ్ళే వారిని మోసం చేస్తే సదరు ఏజెన్సీల రద్దు కు సిఫారసు చేయడంతో పాటు వారి ఫై PD యాక్ట్ పెట్టడం జరుగుతుందన్నారు.

విదేశాల్లో ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం వెళ్ళే వ్యక్తులు నకిలీ ఏజెంట్లను ఆశ్రయించి మోసపోవద్దని సూచిస్తున్నారు. జిల్లాలో ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారు లైసెన్స్ కలిగి ఉన్న ఏజెంట్లను మాత్రమే ఆశ్రయించాలని సూచిస్తున్నారు. వారి ద్వారానే వీసాలు పొందవలసిందిగా సూచించారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు లైసెన్స్ గల ఏజెంట్ల వివరాలు తెలుసుకునేందుకు పోలీస్ శాఖ వారిని సంప్రదించవచ్చని సూచించారు. జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోతే సమాచారం అందించాలని ఎస్పీ కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Latest Articles
మార్కెట్‌‌లో మరో నయా స్కూటర్‌ రిలీజ్‌ చేసిన ఇవూమీ..!
మార్కెట్‌‌లో మరో నయా స్కూటర్‌ రిలీజ్‌ చేసిన ఇవూమీ..!
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్..
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్..
పేరు వింటే తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి..
పేరు వింటే తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి..
అప్రమత్తంగా ఉండండి.. ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచన..
అప్రమత్తంగా ఉండండి.. ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచన..
అమ్మో.. మహానంది అలయ పరిసరాల్లో చిరుత హల్ చల్.. భయాందోళనలో భక్తులు
అమ్మో.. మహానంది అలయ పరిసరాల్లో చిరుత హల్ చల్.. భయాందోళనలో భక్తులు
ఐటీ ఫైల్‌ చేసే వారికి అలెర్ట్‌..కేంద్రం నిర్ణయంపైనే ఆశలన్నీ..!
ఐటీ ఫైల్‌ చేసే వారికి అలెర్ట్‌..కేంద్రం నిర్ణయంపైనే ఆశలన్నీ..!
మీ బైక్‌కి మీరే సర్వీసింగ్ చేసుకోవచ్చు.. ఈ టిప్స్‌తో ఇంట్లోనే..
మీ బైక్‌కి మీరే సర్వీసింగ్ చేసుకోవచ్చు.. ఈ టిప్స్‌తో ఇంట్లోనే..
నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌లో కొలువులకు నోటిఫికేషన్‌ విడుదల
నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌లో కొలువులకు నోటిఫికేషన్‌ విడుదల
పీఎం కిసాన్ డబ్బులు పోస్టాఫీసు నుంచి కూడా తీసుకోవచ్చు!
పీఎం కిసాన్ డబ్బులు పోస్టాఫీసు నుంచి కూడా తీసుకోవచ్చు!
ఆ హీరోని కౌగిలించుకున్న రంభ .. కోపంతో రగిలిపోయిన రజినీకాంత్
ఆ హీరోని కౌగిలించుకున్న రంభ .. కోపంతో రగిలిపోయిన రజినీకాంత్