AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLC Election: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. ఓటు ప్రాధాన్యత తెలుపడం ఎలాగో తెలుసా..?

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు జరిగే పోలింగ్ కు అధికార యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రచారం ముగించిన అభ్యర్థులు ఇక పట్టభద్రుల ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. విద్యావంతుల ఓటు ప్రాధాన్యత తెలుపడం ఎలాగో తెలుసా..?

MLC Election: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. ఓటు ప్రాధాన్యత తెలుపడం ఎలాగో తెలుసా..?
Graduate Mlc By Election
G Peddeesh Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: May 26, 2024 | 12:02 PM

Share

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తుది అంకానికి చేరుకుంది. ప్రచారానికి గడువు ముగియడంతో ఇక అందరి దృష్టి పోలింగ్‌పై పడింది. మే 27వ తేదీన ఉదయం 8గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుంది. సాయంత్రం నాలుగింటికి ముగియనుంది. పోలింగ్ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జిల్లాల కేంద్రాల్లో బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేస్తున్నారు. పోలింగ్ రోజు ఉదయం 6 నుంచి రాత్రి 8గంటల వరకు 144 సెక్షన్ అమలు చేయనున్నారు. 48 గంటలపాటు వైన్‌ షాపులు బంద్ చేశారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 52మంది బరిలో ఉన్నారు. జంబో బ్యాలెట్ పేపర్‌తో పోలింగ్ నిర్వహించనున్నారు ఎన్నికల అధికారులు. మొత్తం 4లక్షల 63వేల 839 మంది ఓటర్లు ఉండగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్షా 73వేల 406మంది, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షా 23వేల 985, ఉమ్మడి నల్గొండ జిల్లాలో లక్షా 66వేల 448 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు. 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. పోలింగ్ డే రోజు ఈ మూడు జిల్లాల్లో ప్రత్యేక సెలవు ప్రకటించారు. అధికారులు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద పోలింగ్ సామాగ్రి పంపిణీ చేశారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు జరిగే పోలింగ్ కు అధికార యంత్రాంగం చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రచారం ముగించిన అభ్యర్థులు ఇక పట్టభద్రుల ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. విద్యావంతుల ఓటు ప్రాధాన్యత తెలుపడం ఎలాగో తెలుసా..?

అయితే సాధారణ ఎన్నికలతో పోల్చితే పట్టభద్రుల పోలింగ్ కాస్త భిన్నంగా ఉంటుంది.. 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన నేపథ్యంలో జంబో బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓటర్లు అభ్యర్థులకు అంకె ద్వారా వారి ప్రాధాన్యత తెలపాల్సి ఉంటుంది. ఒకటోవ ప్రాధాన్యత, రెండోవ ప్రాధాన్యత ఇలా వారికి నచ్చిన అభ్యర్థికి ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాల్సి ఉంటుంది.

ఓటు వేసే క్రమంలో ఇంటూ గుర్తు, ఇతర సింబల్స్ రాయకూడదు. మొదటి ప్రాధాన్యత అయితే అక్కడ ఒక నిలువు గీత మాత్రమే పెట్టి వారి ప్రాధాన్యత తెలపాలి. పోలింగ్ బూత్‌లో ఇచ్చిన పెన్ను మాత్రమే వాడాలి. కాదని ఎలాంటి ప్రయోగాలు చేసిన మీ ఓటు బురదలో వేసినట్లే అవుతుందంటున్నారు ఎన్నికల సంఘం అధికారులు. సోమవారం 27వ తేదీ ఉదయం 8గంటల నుండి సా.4 వరకు పోలింగ్ జరుగుతుంది.. 48 గంటల పాటు మూడు జిల్లాల పరిధిలో మద్యం దుకాణాలు మూసి వేశారు. పోలింగ్ రోజు ఉ.6 నుండి సా.8 వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.