Telangana: సీఎం రేవంత్ రెడ్దికి సవాలుగా ఆ రెండు నియోజకవర్గాలు.. గెలిచేందుకు వ్యూహాలివే..
తెలంగాణ కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికలు పెద్ద సవాల్‌గా మారాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మెజార్టీ సీట్లు సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఫలితాల్లో తేడా వచ్చిందంటే అదో పెద్ద చర్చకు దారితీస్తోంది. అందుకే పిసిసి చీఫ్‌గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా మెజార్టీ సీట్లు సాధించే పనిలో పడ్డారు. అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలుకొని ప్రచారం వరకు అంతా తానే నడిపిస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికలు పెద్ద సవాల్‌గా మారాయి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మెజార్టీ సీట్లు సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఫలితాల్లో తేడా వచ్చిందంటే అదో పెద్ద చర్చకు దారితీస్తోంది. అందుకే పిసిసి చీఫ్‌గా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా మెజార్టీ సీట్లు సాధించే పనిలో పడ్డారు. అభ్యర్థుల ఎంపిక నుంచి మొదలుకొని ప్రచారం వరకు అంతా తానే నడిపిస్తున్నారు. అయితే 17 పార్లమెంటు నియోజకవర్గం 14 సీట్లు గెలవాలనేది కాంగ్రెస్ టార్గెట్. పది నుంచి 12 సీట్లు గెలిచినా కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు గానే చూడవచ్చు అనేది కాంగ్రెస్ సర్కిల్లో జరుగుతున్న చర్చ. మెజార్టీ సీట్లు సాధించడంతోపాటు ఆ రెండు నియోజకవర్గాలు కూడా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి సవాల్‌గా మారిపోతున్నాయి.
సీఎం రేవంత్ రెడ్డి మొన్నటి వరకు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు. ఒకరకంగా అది రేవంత్ రెడ్డికి సిట్టింగ్ సీటు. ఇప్పుడు ఆ సీటును గెలవాల్సిన అనివార్యత ఏర్పడింది. సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి మల్కాజిగిరిలో పట్టు సాధించే పనిలో పడ్డారు. మల్కాజిగిరి సీటులో గెలవడం కాంగ్రెస్‌కి సవాల్‌గా మారింది. అభ్యర్థి ఎంపికలో కూడా ఆచితూచి అడుగులు వేశారు సీఎం రేవంత్. పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా సమీక్ష కూడా మల్కాజిగిరి నుంచే మొదలుపెట్టారు. పార్టీ నాయకులు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలకు గెలిచి తీరాలని తేల్చి చెప్పారు. మల్కాజిగిరి గెలిచి తీరాల్సిందేనని దిశా నిర్దేశం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిలకు పూర్తిస్థాయిలో బాధ్యతలను అప్పగించారు. నేరుగా సీఎం సమీక్షిస్తూ మల్కాజిగిరిలో పట్టు సాధించే పనిలో పడ్డారు. దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గం కావడంతో ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న నాయకులకు పని విభజన చేసి ప్రచారంలోకి దూసుకెళ్తోంది. కాంగ్రెస్.
మరోవైపు మహబూబ్‌నగర్ పార్లమెంటు నియోజకవర్గంపై కూడా కాంగ్రెస్ కన్నేసింది. ఇది సీఎం సొంత జిల్లా.. దీనికి తోడు సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఈ పార్లమెంట్ పరిధిలోనే ఉన్నాయి. ఇప్పటికి కొడంగల్ నియోజకవర్గం మండలాల వారీగా సమీక్షలు రెండుసార్లు నిర్వహించారు. మహబూబ్‌నగర్ పార్లమెంటులో పూర్తిస్థాయిలో మెజారిటీ కొడంగల్ నుంచి తీసుకురావాలన్నది సీఎం ఆలోచన. దీనికి తోడు సొంత జిల్లా అవడంతో పార్టీ ఎమ్మెల్యేలు.. క్యాడర్ని అప్రమత్తం చేశారు. సీఎం పార్లమెంట్ పరిధిలో మెజారిటీ ఎమ్మెల్యే సీట్లు కూడా కాంగ్రెస్ గెలుచుకుంది కాబట్టి పూర్తిస్థాయిలో ఎమ్మెల్యేలకు టార్గెట్ విధించి పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గంలో జండా ఎగరాలని కసితో ఉన్నారు. ఇలా సీఎం రేవంత్ రెడ్డికి ఒకవైపు తన సిట్టింగ్ సీటు మల్కాజిగిరి ఎంపీని గెలిపించాలి.. మరోవైపు తన సొంత జిల్లాలో ఉన్న పార్లమెంటులో సీట్లను కూడా గెలిపించుకోవాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా కీలకమైన నాయకులను ఆ రెండు నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా నియమించి సీఎం సమీక్షిస్తున్నారు. త్వరలోనే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సభలు సమావేశాలు నిర్వహిస్తూ జనంలోకి వెళ్లాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మల్కాజిగిరి, మహబూబ్‌నగర్ నియోజకవర్గాల్లో పట్టు సాధించే పనిలో పడ్డారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..