కేసిఆర్ చెప్పిన 20 మంది ఎమ్మెల్యేల కథేంటి.. ఆయన కామెంట్స్ వెనుక సారాంశమిదేనా..

తెలంగాణ భవన్ లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో సెన్సేషనల్ కామెంట్స్ కొన్ని చేశారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు సంతోషంగా లేరని, కాంగ్రెస్ పార్టీలో చేరితే అక్కడ అంతా బిజెపి హవా నడుస్తుందని తనకు చెప్పుకున్నారంటూ సమావేశంలో వివరించారు. అంతేకాదు 20 మంది ఎమ్మెల్యేలతో ఒక సీనియర్ నేత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని.. తనను సంప్రదిస్తే ఇప్పుడే తొందరపడకు అని వారించానని చెప్పుకొచ్చారు.

కేసిఆర్ చెప్పిన 20 మంది ఎమ్మెల్యేల కథేంటి.. ఆయన కామెంట్స్ వెనుక సారాంశమిదేనా..
Kcr Chevella
Follow us
Rakesh Reddy Ch

| Edited By: Srikar T

Updated on: Apr 19, 2024 | 3:08 PM

తెలంగాణ భవన్ లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో సెన్సేషనల్ కామెంట్స్ కొన్ని చేశారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు సంతోషంగా లేరని, కాంగ్రెస్ పార్టీలో చేరితే అక్కడ అంతా బిజెపి హవా నడుస్తుందని తనకు చెప్పుకున్నారంటూ సమావేశంలో వివరించారు. అంతేకాదు 20 మంది ఎమ్మెల్యేలతో ఒక సీనియర్ నేత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని.. తనను సంప్రదిస్తే ఇప్పుడే తొందరపడకు అని వారించానని చెప్పుకొచ్చారు. మరో రెండు మూడేళ్లలో ఎన్నికలు వస్తాయి ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మనమే అన్నారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీని బిజెపి బతకనివ్వదనికి కామెంట్ కూడా చేశారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో ఎవరు చేసినా రాజకీయ ప్రాధాన్యం కోసం చేశారని భావించేవారు. కానీ రాష్ట్రానికి పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, రాజకీయాల్లో చక్రం తిప్పిన కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎలాంటి సోర్స్ లేకుండా కెసిఆర్ ఈ స్థాయి వ్యాఖ్యలు చేయరనే అంతా భావిస్తున్నారు.

అయితే కెసిఆర్ మాటలు పక్కనపెడితే ఇంతకు 20 మంది ఎమ్మెల్యేలతో భారత రాష్ట్ర సమితిలో చేరుతా అన్న ఆ నేత ఎవరు అనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పొలిటికల్ సర్కిల్స్‎లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బిఆర్ఎస్ నేతలు చాలా రోజులుగా కాంగ్రెస్‎లో రేవంత్ రెడ్డికి నల్లగొండ, ఖమ్మం నేతల నుంచి ప్రమాదం పొంచి ఉందంటూ అనేక ప్రసంగాలలో చెప్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని తాము కూల్చమని ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆ రెండు జిల్లాల నేతలే పక్కన బాంబుల్లా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు కెసిఆర్‎ను సంప్రదించింది ఆయనతో టచ్‎లో ఉన్నది కూడా ఆ రెండు జిల్లాల్లో ఉన్న ఒక నేత అనే చర్చ మొదలైంది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసి వెళ్లిన నాయకుడా.. లేక కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కేసిఆర్‎తో సన్నిహిత సంబంధాలు ఉన్న నాయకుడా అని పార్టీలో చర్చించుకుంటున్నారు. 20 మంది ఎమ్మెల్యేలతో వస్తాను అంటున్నారంటే ఆయనకు 20 మంది ఎమ్మెల్యేల బలం ఉండి ఉండాలి. ఆ స్థాయి కాంగ్రెస్ నేత ఎవరనేది బలమైన డిస్కషన్ జరుగుతుంది.

మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీలోనూ దీనిపైన చర్చ మొదలైంది. కెసిఆర్ క్యాడర్ను కాపాడుకోవడానికి కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి ఇలాంటి కామెంట్ చేశారని కొట్టి పడేస్తున్నారు. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న బిఆర్ఎస్ అధినేత.. మరో 20 మంది ఎమ్మెల్యేలు పార్టీలకు వస్తారంటే ఎందుకు కాదంటారు. మరోవైపు ఎంఐఎం సపోర్ట్ చేస్తే ఆయనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. ఇలాంటి అవకాశాన్ని కేసీఆర్ లాంటి లీడర్ వదులుకుంటారా అని కాంగ్రెస్ లీడర్లు ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నారు. ఇదంతా కావాలని ఎన్నికల ముందు చేస్తున్న ప్రచారం. కెసిఆర్ లాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పార్టీ నుంచి బయటకు వెళ్లాలనుకునే లీడర్లు కాస్త ఆలోచించి కొంతకాలమైనా ఆగుతారనేది కేసీఆర్ ఆలోచన అని కాంగ్రెస్ కొట్టి పడేస్తుంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఏదైనా, ఎప్పుడైనా జరగొచ్చు అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. ఎవరు ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వెళ్తున్నారు అర్థం కాని పరిస్థితి. దీంతో పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో రసవత్తర రాజకీయ పరిస్థితులను చూడబోతున్నాం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..