AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు.. ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్..

వీసా దేవుడుగా పిలవబడే చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ సంతానం లేని మహిళలకు గరుడ ప్రసాదం అందజేస్తారు ఆలయ అర్చకులు. గరుడ ప్రసాదం తీసుకున్న వారికి సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తుండడంతో ప్రతి సంవత్సరం ఈ ప్రసాదానికి ఆదరణ పెరుగుతోంది.

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు.. ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్..
Hyderabad Traffic
Peddaprolu Jyothi
| Edited By: Srikar T|

Updated on: Apr 19, 2024 | 12:44 PM

Share

వీసా దేవుడుగా పిలవబడే చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ సంతానం లేని మహిళలకు గరుడ ప్రసాదం అందజేస్తారు ఆలయ అర్చకులు. గరుడ ప్రసాదం తీసుకున్న వారికి సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తుండడంతో ప్రతి సంవత్సరం ఈ ప్రసాదానికి ఆదరణ పెరుగుతోంది. సుమారుగా 5000 మందికి పైగా మహిళలు ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఈ ఏడాది కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయం దగ్గర భక్తులు బారులు తీరడంతో హిమాయత్ సాగర్ జంక్షన్.. ఇటు సన్ సిటీ లంగర్ హౌస్ వరకు వాహనాలు బారులు తీరాయి. దీంతో ఆఫీసులకు, స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సోషల్ మీడియాలో గరుడ ప్రసాదంపై ప్రచారం ఎక్కువ జరగడంతో ఇంత పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారని తెలుస్తోంది. ఈ ప్రసాదాన్ని ఉదయం నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పంపిణీ చేస్తారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ప్రసాదాన్ని తీసుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి చిలుకూరికి క్యూ కట్టారు. దీంతో ఆఫీసులకు వెళ్లే టైం, పిల్లలు స్కూలుకు వెళ్లే సమయం మరోవైపు భక్తుల తాకిడితో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. గరుడ ప్రసాదం స్వీకరించిన మహిళలలో సంతానం కలగడంతో ఆ విషయం తెలుసుకున్న చాలామంది మహిళలు చిలుకూరికి చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున భక్తుల రాకతోనే ట్రాఫిక్‎కు అంతరాయం ఏర్పడింది. మరోవైపు 9 గంటలకు కాలేజీలకు ఆఫీసులకు వెళ్లాల్సిన వారు ఈ ట్రాఫిక్‎లో చిక్కుకుపోయారు. చిలుకూరు వెళ్లే మార్గంలో ట్రాఫిక్‎ను క్లియర్ చేయాల్సిందిగా ట్రాఫిక్ పోలీసులకు వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

పూర్తి వీడియో..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..