Telangana: చేపల కోసం వల వేస్తే కాసుల పంట పడింది.. ఏం చిక్కిందో చూస్తే స్టన్ అవుతారు.!

కొందరి జాలర్ల జీవనాధారం సముద్రమే. రోజుల తరబడి సముద్రంలోకి వెళ్లి వేట సాగిస్తే.. వారికి దొరికేది కొంత ఆదాయమే. కానీ కొన్నిసార్లు ఆ సముద్రం.. ఈ జాలర్లను కరుణిస్తుంది. అందుకే వారి వలకు లక్ కూడా చిక్కుతుంది. అప్పుడప్పుడూ అరుదైన, సిరులు కురిపించే పెద్ద చేపలు..

Telangana: చేపల కోసం వల వేస్తే కాసుల పంట పడింది.. ఏం చిక్కిందో చూస్తే స్టన్ అవుతారు.!
Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 19, 2024 | 12:45 PM

కొందరి జాలర్ల జీవనాధారం సముద్రమే. రోజుల తరబడి సముద్రంలోకి వెళ్లి వేట సాగిస్తే.. వారికి దొరికేది కొంత ఆదాయమే. కానీ కొన్నిసార్లు ఆ సముద్రం.. ఈ జాలర్లను కరుణిస్తుంది. అందుకే వారి వలకు లక్ కూడా చిక్కుతుంది. అప్పుడప్పుడూ అరుదైన, సిరులు కురిపించే పెద్ద చేపలు జాలర్ల వలకు చిక్కుతుంటాయి. ఈ కోవలోనే ఇటీవల తెలంగాణలోని ఓ మత్స్యకారుడికి పంట పండింది. వివరాల్లోకెళ్తే.. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అనిల్ అనే మత్స్యకారుడు.. కొదురుపాక ముంపు గ్రామంలోని జలాశయంలో గురువారం చేపల వేటకు వెళ్లాడు. ఆ నీటిలోకి వల వేయగా.. కొద్దిసేపటికి అది బరువెక్కింది. పైకి లాగి చూడగా ఓ భారీ చేప వలకు చిక్కింది. సుమారు 30 కిలోల మీనం చేప అతడి వలకు చిక్కింది. ఇంత పెద్ద చేప వలకు చిక్కడంతో.. అతడి సంతోషానికి అవధులు లేవు. దాన్ని మార్కెట్‌లో భారీ ధరకు అమ్ముకున్నాడు సదరు జాలరి.

Fish Caught