ఇదెక్కడి విడ్డూరం బాబోయ్.! ఒక్క ఓటరు.. రెండు రాష్ట్రాల్లో ఓటు.. ఎక్కడో తెలుసా.?

తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు వివాదం కొనసాగుతున్న ఆ 14 గ్రామాల్లో ఓట్ల పండుగ వచ్చిన సమయంలో డబుల్ ధమాకా కొనసాగుతోంది. దేశమంతా ఒకేసారి పార్లమెంట్ ఎన్నికల సాగుతున్న ఈ తరుణంలో అక్కడ మేమే.. ఇక్కడ మేమే అంటున్న ఆ 14 గ్రామాల ఓటర్లు. రెండు రాష్ట్రాలు రెండు ఓట్లు..

ఇదెక్కడి విడ్డూరం బాబోయ్.! ఒక్క ఓటరు.. రెండు రాష్ట్రాల్లో ఓటు.. ఎక్కడో తెలుసా.?
Representative Image
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 19, 2024 | 1:44 PM

తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు వివాదం కొనసాగుతున్న ఆ 14 గ్రామాల్లో ఓట్ల పండుగ వచ్చిన సమయంలో డబుల్ ధమాకా కొనసాగుతోంది. దేశమంతా ఒకేసారి పార్లమెంట్ ఎన్నికల సాగుతున్న ఈ తరుణంలో అక్కడ మేమే.. ఇక్కడ మేమే అంటున్న ఆ 14 గ్రామాల ఓటర్లు. రెండు రాష్ట్రాలు రెండు ఓట్లు.. ఒక్కటేమిటి అన్నింట్లో మావి డబుల్ ధమాకానే అంటున్నారు. అభివృద్దిలో మాత్రం ఏ రాష్ట్రం పట్టించుకోకపోవడంతో కష్టాలు కూడా డబులే అంటున్నారు వీళ్లంతా. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న తొలి విడత లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్ర చంద్రపూర్ పార్లమెంట్ పరిదిలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఈ 14 గ్రామాల సరిహద్దు వివాద ఓటర్లు తిరిగి మే 13 న తెలంగాణ లో జరగ బోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల పండుగలో పాల్గొంటామని చెపుతున్నారు.

ఇటు తెలంగాణ రాష్ట్రం కొమురంభీం జిల్లా కెరమెరి మండలం.. అటు మహారాష్ట్ర చంద్రా పూర్ జిల్లా జివితి తాలుకా.. రెండు రాష్ట్రాలు రెండు బాషలు.. రెండు ఓట్లు.. అవును కెరమెరి మండలంలోని పరందోలి, కోట, శంకర్కులొద్ది, ముకధం గూడ, లెండి గూడ, ఈసాపూర్, మహర్జా గూడ, అనంతపూర్, భోలాపూర్, గౌరీ, లేందీజలా, లక్మాపూర్, జంకపూర్, పద్మావతి.. ఈ 14 గ్రామాలు నాలుగు దశాబ్దాలుగా సరిహద్దు వివాదాన్ని ఎదుర్కొంటున్నాయి.

అయితే సరిహద్దు వివాదస్పద గ్రామాల్లోని ప్రజలకు తెలంగాణతోపాటు మహారాష్ట్రలోనూ ఓటు హక్కు ఉండటంతో.. ఈసారి‌ వన్ నేషన్ వన్ ఓట్ లో భాగంగాఏదో ఒకే రాష్ట్రంలో మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల అదికారులు అవగాహన‌కల్పించారు. అయితే సుప్రీం కోర్ట్ లో కేసు తేలేంతే వరకు ఈ నిబందనలు‌ఏవి తమకు వర్తించవంటున్నారు. ఇందులో భాగంగా తొలి విడత ఎన్నికల్లో భాగంగా చంద్రపూర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నామని.. మే 13 న మరొసారి ఓటు హక్కు వినియోగించుకుంటామని చెప్తున్నారు 14 గ్రామాల ఓటర్లు.

పరందోలి, తాండ, లేండిజాల, చింతగూడ, ముకదాంగూడ, మహారాజ్‌గూడ, బోలపటార్‌, గౌరి, లేండిగూడ, అంతాపూర్‌, ఏసాపూర్‌, నారాయణగూడ గ్రామాల్లో పురుషులు 1,763, మహిళలు 1,594 మొత్తం 3,357 మంది ఓటర్లు ఉండగా.. పరందోలి, ముకదాంగూడ, బోలపటార్‌, అంతాపూర్‌, గౌరి గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిన మహారాష్ట్ర ఎన్నికల కమిషన్.. తొలి విడతలో భాగంగా చంద్రపూర్ లోక్ సభ కు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం ఏడు గంటల నుండే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక్కడ ఉన్న దాదాపు 3,819 మంది లంబాడాలుండగా.. తెలంగాణలో వీరంతా ఎస్టీలుగా కొనసాగుతుంటే.. మహారాష్ట్రలో మాత్రం వెనుకబడిన కులాల్లో సంచార తెగగా కొనసాగుతున్నారు.

1983 ఫిబ్రవరిలో రెండు రాష్ట్రాల అధికారులు , ప్రజా ప్రతి నిధులు ఒక ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ గ్రామాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందుతాయని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం మేరకు ఈ 14 గ్రామాలను అప్పటి ఆదిలాబాద్ జిల్లాలోని కెరమెరి మండలంలో చేర్చారు. తెలంగాణ ఏర్పటు‌తర్వాత ఈ గ్రామాలు కొత్త జిల్లా కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి వెళ్లాయి. అయితే తెలంగాణ ఏర్పాటుకంటే ముందే ఈ 14 గ్రామాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేర్చడాన్ని నిరసిస్తూ 1991 లో మహారాష్ట్రలోని రాజుర నియోజకవర్గం ఎమ్మెల్యే వామనరావు చాటప్ మహారాష్ట్ర శాసనసభలో లేవనెత్తారు. 19996 లో అప్పటి బీజేపీ -శివసేన ప్రభుత్వం ఈ 14 గ్రామాలను ఉమ్మడి ఆంద్రప్రదేశ్ కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కేబినెట్ ఉత్తర్వులను‌ రద్దు‌చేసింది. దీంతో అప్పటి ఆంద్రప్రదేశ్ సర్కార్ సుప్రీంకోర్టు మెట్లెక్కింది. అక్కడితో మొదలైన సరిహద్దు వివాదం నాలుగు‌ దశాబ్దాలుగా నానుతూనే ఉంది.

దీంతో ఈ 14 గ్రామాల సరిహద్దు పంచాయితీ తేలకపోవడంతో రెండు రాష్ట్రాలు ఈ‌గ్రామాల బాగోగులు చూడాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో‌ఇరు రాష్ట్రాలు తమతమ అభివృద్ది కార్యక్రమాలతో పాటు.. పాఠశాలు.. గ్రామపంచాయితీలని ఏర్పాటు చేసింది. దీంతో ఈ 14 గ్రామాల్లో ఓటర్లు అక్కడ మేమే.. ఇక్కడ మేమే అంటూ డబుల్ ఓటు హక్కును కలిగి ఇరు వైపుల ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తాజా లోక్ సభ ఎన్నికల్లోను డబుల్ ఓట్లు వేస్తామని చెప్తున్నారు. మహారాష్ట్ర లో 48 లోక్ సభ స్థానాలుండగా.. తొలి విడతలో ఎన్నిక లు జరుగుతున్న చంద్రపూర్ పార్లమెంట్ పరిదిలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు వీరంతా. ఈ సరిహద్దు వివాద ఓటర్ల కోసం చంద్రపూర్ జిల్లా జివితి తాలూకా పరిదిలోని పరంధోళి, నోకేవాడ, భోలా పటార్, అంతాపూర్ లలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు మహారాష్ట్ర ఎన్నికల అదికారులు. ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోబోతున్న వారిలో 3357 మంది తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న వారే కావడం గమనార్హం.

పరంధోళి పోలింగ్ కేంద్రం ( పరంధోళి, తండా, కోటా, శంకర్ లొద్ది, ముకదంగూడ )లో 1,367 మంది ఓటర్లు. నోకేవాడ( మహారాష్ట్ర పోలింగ్ కేంద్రం )లో మహరాజ్గూడ ఓటర్లు 370.. భోలాపటార్ (భోలాపటార్, గౌరి, లేం డిగూడ ) 882, అంతాపూర్ పోలింగ్ కేంద్రం ( నారాయణగూడ, ఏసాపూర్, పద్మావతి, ఇంద్రాన గర్, అంతాపూర్)లో 978మంది మహారాష్ట్రా చంద్రపూర్ ఎంపి అభ్యర్థి గెలుపు కోసం పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చంద్రపూర్ పార్లమెంట్ బరిలో బీజేపీ నుంచి సుధీర్ మునగంటీవార్, కాంగ్రెస్ నుంచి ప్రతిభా థానోర్కర్ పోటీలో ఉన్నారు. ఇటు మరో 24 రోజుల్లో.. మే 13న తెలంగాణ ఆదిలాబాద్ ఎంపీ ఎన్నికలుండగా.. మరొసారి పోలింగ్ లో పాల్గొంటామంటున్నారు ఈ 14 గ్రామాల ఓటర్లు. వన్ నేషన్ వన్ ఓటు మాకు వర్తించదని ఖరాఖండిగా చెప్తున్నారు.

Latest Articles