Hyderabad: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్ - Watch Video

Hyderabad: అసదుద్దీన్ – మాధవీ లత మధ్య డైలాగ్ వార్ – Watch Video

Janardhan Veluru

|

Updated on: Apr 19, 2024 | 1:36 PM

హైదరాబాద్‌ ఎంపీ ఫైట్‌ సెగలు రేపుతోంది. అసదుద్దీన్‌, మాధవీలత ప్రచారమే కాదు.. వారి మధ్య మాటల యుద్ధం హాట్‌హాట్‌గా సాగుతోంది. మసీదు వైపు బాణం విడుస్తున్నట్లు సైగలు చేసిన మాధవీలతపై ఈసీ యాక్షన్‌ తీసుకోవాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్‌ చేశారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.

హైదరాబాద్‌ ఎంపీ ఫైట్‌ సెగలు రేపుతోంది. అసదుద్దీన్‌, మాధవీలత ప్రచారమే కాదు.. వారి మధ్య మాటల యుద్ధం హాట్‌హాట్‌గా సాగుతోంది. మసీదు వైపు బాణం విడుస్తున్నట్లు సైగలు చేసిన మాధవీలతపై ఈసీ యాక్షన్‌ తీసుకోవాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్‌ చేశారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. అసదుద్దీన్ ఒవైసీ చేసిన ఆరోపణలను మాధవీ లత తిప్పికొట్టారు. ముస్లీం, హిందువులు అందరికీ కోసం తాను పనిచేయాలనుకుంటున్నట్లు చెప్పారు. గాల్లో బాణం వదిలితే.. దాన్ని మసీదు వైపు విడిచినట్లు వీడియోలో చూపిస్తే తనకు ఏం సంబంధమని ప్రశ్నించారు. అమాయక ముస్లీంలను రెచ్చగొట్టేందుకు అసదుద్దీన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పాతబస్తీ ఎప్పటికీ మురికివాడలానే ఉండాలా అంటూ మండిపడ్డారు. హిందూ ముస్లింల మధ్య చిచ్చు రేపొద్దంటూ అసద్‌పై మాధవీ లత ఫైర్‌ అయ్యారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ అభ్యర్థి మాధవీలత పోటీ చేస్తుండటంతో హైదరాబాద్ నియోజకవర్గం హాట్ సీట్‌గా మారింది.