Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు వేసిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్..
తమిళనాడులో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలివిడతలో ఒకేసారి 39లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్ అధినేత, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన చేతికి ఉన్న ఓటు సిరా గుర్తును చూపిస్తూ ఎక్స్ ఖాతాలో ఫోటోలను షేర్ చేశారు.
తమిళనాడులో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలివిడతలో ఒకేసారి 39లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కోయంబత్తూరులో ఇషా ఫౌండేషన్ అధినేత, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన చేతికి ఉన్న ఓటు సిరా గుర్తును చూపిస్తూ ఎక్స్ ఖాతాలో ఫోటోలను షేర్ చేశారు. ప్రతి ఒక్కరు ఈ పౌర హక్కును వినియోగించుకోవాలని సందేశాన్ని ఇస్తున్నట్లు ఉంది ఈ ఫోటో. ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 12.55% ఓటింగ్ నమోదైనట్లు తెలిపారు అధికారులు. కళ్లకురిచ్చి నియోజకవర్గంలో మాత్రం 15% పైగా ఓటింగ్ నమోదు అయింది. సద్గురు తోపాటు పలువురు రాజకీయ నాయకులు కనిమొళి, గణపతి పి రాజ్‌కుమార్, ఏఐఏడీఎంకే నుంచి సింగై రామచంద్రన్, సీపీఐ(ఎం) నుంచి పీఆర్ నటరాజన్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సినీ నటుడు కమల్ హాసన్ చెన్నైలోని కోయంబేడులో ఓటు వేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??

