PM Modi: మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ.. కాంగ్రెస్ తీరుపై చురకలు..

PM Modi: మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ.. కాంగ్రెస్ తీరుపై చురకలు..

Srikar T

|

Updated on: Apr 19, 2024 | 4:47 PM

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ప్రధాని మోదీ మధ్యప్రదేశ్ లోని దామోలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్న మోదీ భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ ప్రసంగంలో రామ మందిరం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో హిందువులకు ఇతర వర్గీయులకు మధ్య ఒకరకమైన యుద్దం జరుగుతూ ఉండేదన్నారు. అదే రామజన్మభూమి, బాబ్రీ మసీద్ వ్యవహారంలో నిత్యం ఘర్షణ వాతావరణం ఉండేదని గుర్తు చేశారు.

లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ప్రధాని మోదీ మధ్యప్రదేశ్ లోని దామోలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్న మోదీ భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ ప్రసంగంలో రామ మందిరం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో హిందువులకు ఇతర వర్గీయులకు మధ్య ఒకరకమైన యుద్దం జరుగుతూ ఉండేదన్నారు. అదే రామజన్మభూమి, బాబ్రీ మసీద్ వ్యవహారంలో నిత్యం ఘర్షణ వాతావరణం ఉండేదని గుర్తు చేశారు. ఇలా దశాబ్ధల నుంచి జరుగుతున్న పోరుకు ముగింపు చెప్పడం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.

అప్పుడు హిందువులపట్ల న్యాయం ఉందని గుర్తించిన సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించినట్లు చెప్పారు. ఇలా దశాబ్దాల నుంచి సాగిన పోరులో సుప్రీం కోర్టు ఆదేశాలను అందరూ అనుసరించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అయోధ్యలో రామమందిరం నిర్మించబడిందని దీనిని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ పరిరక్షిస్తోందని వివరించారు. ఎలాంటి కుట్రలు, ద్వేషాలు, బేషజాలు లేకుండా అందరికీ ఆనందాన్ని అందించేలా ముందుకు సాగుతోందని ట్రస్ట్ గురించి తెలిపారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా రామ ప్రాణప్రతిష్ట రోజు కాంగ్రెస్ తో పాటు పలువురికి అందించిన ఆహ్వానాల గురించి వాటిని తిరస్కరించిన పరిస్థితులను మరోసారి ప్రజలకు గుర్తు చేశారు.

Published on: Apr 19, 2024 04:38 PM