నల్లగొండ నేతల మధ్య ‘పవర్’ ఫుల్ డైలాగ్ వార్.. యాదాద్రి పవర్ ప్లాంట్ చుట్టే రాజకీయం..

పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడంతో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నల్లగొండ జిల్లాలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య యాదాద్రి పవర్ ప్లాంట్ మంటలు రేపుతోంది. కోమటిరెడ్డి బ్రదర్స్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిల మధ్య విమర్శల పర్వం.. వ్యక్తిగత దూషణల దాకా వెళ్ళింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లో మరింత దూకుడు పెంచింది.

నల్లగొండ నేతల మధ్య 'పవర్' ఫుల్ డైలాగ్ వార్.. యాదాద్రి పవర్ ప్లాంట్ చుట్టే రాజకీయం..
Power Plant War
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 19, 2024 | 2:44 PM

పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడంతో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నల్లగొండ జిల్లాలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య యాదాద్రి పవర్ ప్లాంట్ మంటలు రేపుతోంది. కోమటిరెడ్డి బ్రదర్స్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిల మధ్య విమర్శల పర్వం.. వ్యక్తిగత దూషణల దాకా వెళ్ళింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లో మరింత దూకుడు పెంచింది. సిట్టింగ్ ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్.. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి తెరుకుంటున్న బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికలవేళ కోమటిరెడ్డి బ్రదర్స్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మధ్య ‘పవర్’ వార్ ప్రారంభమైంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేరాజగోపాల్ రెడ్డిలకు, బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి నడుమ విమర్శల పర్వం తార స్థాయికి చేరింది. రాజకీయ విమర్శలతో మొదలైన వార్ వ్యక్తిగత దూషణల దాకా వెళ్లింది. వీరి మధ్య యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మంటలు రేపుతోంది..

రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోని కూలిపోతుందని గులాబీ అధిపతి కేసీఆర్, కేటీఆర్‎తో పాటు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. రేవంత్ రెడ్డి బిజెపిలో చేరడం ఖాయమని జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఈ విమర్శల దాడికి ప్రతిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన సోదరుడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.. జగదీష్ రెడ్డి పై పొలిటికల్ అటాక్ చేశారు. తన అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే రేవంత్ సర్కార్, తమపై మాజీ మంత్రి జగదీష్ జగదీష్ రెడ్డి విమర్శిస్తున్నారని కోమటిరెడ్డి బ్రదర్స్ మండిపడ్డారు.

యాదాద్రి పవర్ ప్లాంట్ చుట్టే నల్లగొండ జిల్లా రాజకీయాలు..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద 2015లో యాదాద్రి థర్మల్ ప్లాంట్ (YTPS) నిర్మాణాన్ని చేపట్టింది. నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో YTPS నిర్మాణాన్ని తెలంగాణ జెన్కో చేపట్టింది. పవర్ ప్లాంట్ నిర్మాణం అనుకున్న గడువుకన్నా రెండేళ్లు అదనంగా కావడంతో అంచనా వ్యయం రూ.29,500 కోట్ల నుంచి రూ.34,500 కోట్లకు పెరిగింది. తాజాగా పవర్ ప్లాంట్ అంచనా వ్యయం రూ.50 వేల కోట్లకు చేరడంతో ప్లాంట్ నిర్మాణ పనులపై రేవంత్ సర్కార్ విచారణకు ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

నేతల మధ్య మంటలు రేపుతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్..

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అనువు కాని ప్రాంతంలో ఏర్పాటు చేసి అంచనా వ్యయాన్ని జగదీశ్ రెడ్డి పెంచారని, ఈ పవర్ ప్లాంట్‎లో రూ.40 వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. తెర వెనుక కాంట్రాక్ట్ పనులను నామినేషన్ పద్ధతిలో అనుచరులకు అప్పగించారని, తద్వారా కేసీఆర్, జగదీశ్ రెడ్డి వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని బ్రదర్స్ ఆరోపిస్తున్నారు. ఇందులో రూ.10 వేల కోట్ల రూపాయలు జగదీశ్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడని బ్రదర్స్ చెబుతున్నారు. ఈ కుంభకోణంపై ఇప్పటికే విచారణ ప్రారంభమైందని, త్వరలో జగదీష్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయమని కోమటిరెడ్డి బ్రదర్స్ విమర్శించారు.

థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం..

ప్రభుత్వం, జెన్కో మధ్య జరిగిన ఒప్పందమని జగదీశ్ రెడ్డి అంటున్నారు. నిర్మాణ పనులు నాణ్యత, నిజాయితీగా చేపట్టేందుకే అప్పటి ప్రభుత్వం బీహెచ్ఈఎల్‎కు అప్పగించిందని జగదీశ్ రెడ్డి అన్నారు. దీంట్లో అవినీతి జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్ధమైనని సవాల్ చేశారు. వందరోజుల కాంగ్రెస్ పాలనలో తమపై చేసిన ఆరోపణలను నిగ్గు తేల్చలేకపోయారని ఆయన విమర్శించారు.

రాజకీయ విమర్శల నుంచి వ్యక్తిగత దూషణలవైపు..

పార్లమెంట్ ఎన్నికలవేళ కోమటిరెడ్డి బ్రదర్స్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మధ్య ప్రారంభమైన రాజకీయ విమర్శలు.. వ్యక్తిగత దూషణల వైపు వెళ్లాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సామాన్యుడిగా ఉన్న జగదీష్ రెడ్డి వేలకోట్ల ఎలా సంపాదించారని కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రశ్నించారు. దీనికి ఘాటుగా జగదీష్ రెడ్డి కూడా స్పందించారు. ఎవరు అవినీతికి పాల్పడ్డారో, ఎవరు, ఎన్ని కోట్లు సంపాదించారో, సొంత ఊళ్లకు పోయి చర్చిద్దామని జగదీష్ రెడ్డికి సవాల్ విసిరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..