Telangana: నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి సంకేతం.?

తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలు అభ్యర్ధులను ఖరారు చేసుకొని ప్రచార రంగంలో తలమునకలయ్యాయి. కానీ పలు స్థానాల్లో అభ్యర్థుల మార్పుపై జోరుగా ప్రచారం సాగుతోంది. అందరికంటే ముందే క్యాండిడేట్స్‎ను ఖరారు చేసిన బిజెపి కూడా కొన్ని స్థానాల్లో అభ్యర్థులపై పునరాలోచన చేస్తోందట. ఇంతకీ అంతలా అభ్యర్థిని మార్చే యోచన ఎందుకొచ్చింది.? ఏ స్థానాల్లో అభ్యర్థులు ఫిట్ అవడం లేదు.?

Telangana: నామినేషన్ వేళ అభ్యర్థుల మార్పు.? చివరి నిమిషంలో ఈ నిర్ణయం దేనికి సంకేతం.?
Telangana BJP
Follow us
Vidyasagar Gunti

| Edited By: Srikar T

Updated on: Apr 19, 2024 | 10:57 AM

తెలంగాణ లోక్ సభ ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలు అభ్యర్ధులను ఖరారు చేసుకొని ప్రచార రంగంలో తలమునకలయ్యాయి. కానీ పలు స్థానాల్లో అభ్యర్థుల మార్పుపై జోరుగా ప్రచారం సాగుతోంది. అందరికంటే ముందే క్యాండిడేట్స్‎ను ఖరారు చేసిన బిజెపి కూడా కొన్ని స్థానాల్లో అభ్యర్థులపై పునరాలోచన చేస్తోందట. ఇంతకీ అంతలా అభ్యర్థిని మార్చే యోచన ఎందుకొచ్చింది.? ఏ స్థానాల్లో అభ్యర్థులు ఫిట్ అవడం లేదు.?

తెలంగాణలో డబుల్ డిజిట్ టార్గెట్ గా వెళ్తోంది..

కమలదళం అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేసింది. బలమైన అభ్యర్థులతో జాబితాలు విడుదల చేసింది. అయితే ఇందులో రెండు మూడు చోట్ల అభ్యర్థులను మార్చాలంటూ పార్టీలో డిమాండ్ వినిపిస్తోంది. ప్రకటించిన అభ్యర్థుల తీరు కూడా మార్పు దిశగా ఉందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. పెద్దపల్లి క్యాండిడేట్ మార్పు దిశగా హైకమాండ్ రీ ఎగ్జామిన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఖమ్మం, నల్గొండ లోక్ సభ అభ్యర్థులను సైతం మారుస్తారంటు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

బలమైన, ప్రజాదరణ, వెల్ నొన్ పర్సనాలిటీని బరిలో దింపాలని.. కొన్ని స్థానాల్లో వేరే పార్టీ నేతలను చేర్చుకొని మరీ 17 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసింది కాషాయ పార్టీ. పెద్దపల్లిలో కూడా కాస్త స్ట్రాంగ్ లీడర్ కావాలని కాంగ్రెస్ నుంచి గోమాస శ్రీనివాస్ ను జాయిన్ చేసుకొని మరీ టికెట్ ఇచ్చింది. ఆయన ఇప్పటి వరకు ఎక్కడా ప్రచారం చేసినట్లు కానీ, పార్టీ శ్రేణులను కలిసిన దాఖలాలు లేవు. టికెట్ తెచ్చుకొని ఇంట్లో కూర్చున్నారని స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ గోమాస శ్రీనివాస్ ఇదే తరహాలో ఇతర పార్టీలో కూడా టికెట్ తెచ్చుకొని ఇంట్లో కూర్చునే వారని అక్కడి నేతలు అంటున్నారు. గెలిచే అవకాశం ఉన్న స్థానంలో ఇలాంటి నేతలకు టికెట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గోమాస తీరుపై పార్టీ సీనియర్ నేతల్లోనూ చర్చ జరుగుతోంది. స్థానిక నేతలను కలుపుకు పోవడం లేదని.. మోడీ హవా, పార్టీ సానుకూలతను వాడుకోవడం లేదని ఫిర్యాదులు అందాయి. దీంతో పెద్దపల్లి టికెట్ మార్చే దిశగా పైస్థాయిలో చర్చ జరుగుతుండటంతో గతంలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఖమ్మం, నల్గొండ అభ్యర్థులను సైతం మరుస్తారంటు జోరుగా ప్రచారం ఊపందుకుంది. అయితే నల్గొండ లోక్ సభ అభ్యర్థి శనంపుడి సైదిరెడ్డి కలిసి వచ్చిన నేతలతో ప్రచారం సాగిస్తున్నారు. స్థానికంగా బిజెపి నేతలు కొంత వ్యతిరేకిస్తున్నా.. ఆయన పని ఆయన చేసుకొని వెళ్తున్నారు. మరో అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని నల్గొండ నేతలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఖమ్మం అభ్యర్థి మార్పు పై కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. టికెట్ ఆశించి పార్టీలో చేరిన జలగం వెంకటరావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న తాండ్ర వినోద్ రావుకు స్థానికంగా సానుకూల పరిస్థితులు లేవని.. క్యాండిడేట్‎ను మార్చాలని వినతులు వచ్చినట్లు సమాచారం. తాండ్ర వినోద్ రావు అందరినీ కలుపుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి మార్పు ఉంటే జలగంకు లైన్ క్లియర్ అయే ఛాన్స్ ఉందని వినికిడి. మొత్తంగా అభ్యర్థులు ప్రచారం పర్వంలో దూసుకెళ్లాల్సిన ఒకరిద్దరు అభ్యర్థుల తీరు వారి టికెట్ మార్చేందుకు దారి తీసే అవకాశం ఇస్తోంది. ఖమ్మం, నల్గొండ అభ్యర్థుల మార్పులో అంత సీరియస్‎నెస్ లేకున్నా పెద్దపల్లి క్యాండిడేట్ మార్పుపై చాలా సీరియస్ డిస్కషన్ నడుస్తోంది. క్యాండిడేట్‎ను మార్చే అవకాశం ఉంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‎లో చేరిన ఎంపి వెంకటేష్ నేత బిజెపిలోకి వస్తారని పెద్దపల్లి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ఊహగానాలు ఊపందుకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..