Telangana: యాక్షన్-రియాక్షన్.. పెరుగుతున్న పొలిటికల్ హీట్.. పేలుతున్న మాటల తూటాలు..

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ప్రత్యర్థులు చేస్తున్న కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చే విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు నేతలు. కూతురి బెయిల్ కోసం బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని నారాయణపేట సభలో ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి..

Telangana: యాక్షన్-రియాక్షన్.. పెరుగుతున్న పొలిటికల్ హీట్.. పేలుతున్న మాటల తూటాలు..
KCR - Revanth Reddy - Kishan Reddy
Follow us

|

Updated on: Apr 17, 2024 | 9:54 PM

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ప్రత్యర్థులు చేస్తున్న కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చే విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు నేతలు. కూతురి బెయిల్ కోసం బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారని నారాయణపేట సభలో ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి.. ఇంకేముంది.. సీఎం రేవంత్‌కు అదే రేంజ్‌లో కౌంటర్ ఇచ్చింది బీఆర్ఎస్. మళ్లీ చెబుతున్నా.. ఎన్నికల తరువాత సీఎం రేవంత్ బీజేపీలో చేరడం ఖాయమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్.

సీఎం రేవంత్ రెడ్డి భయం చూస్తుంటే ఈ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా కనిపించడం లేదన్నారు కేసీఆర్. ఎవరు ఎప్పుడు బీజేపీలో కలుస్తారో.. సీఎం రేవంత్ జంప్ కొడతారో అని కామెంట్ చేశారు.

కేసీఆర్‌ కామెంట్స్‌కు కాంగ్రెస్‌ నుంచి రియాక్షన్ గట్టిగానే వచ్చింది. కాంగ్రెస్‌ను టచ్ చేస్తే బీఆర్ఎస్ అనేదే ఉండదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు పునాదులు లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే కేసీఆర్.. కాంగ్రెస్ సర్కార్‌ను టచ్ చేసి చూడాలన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ ఈ స్థాయిలో సాగుతుంటే.. బీజేపీ మాత్రం ఇదంతా డ్రామా అని కామెంట్ చేసింది. బీజేపీని అడ్డుకునేందుకు కేసీఆర్, కేటీఆర్, రేవంత్ డూప్ ఫైటింగ్ చేసుకుంటున్నారని అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్.

మొత్తానికి తెలంగాణలో పొలిటికల్ హీట్ రోజురోజుకు పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఈ రాజకీయ యుద్ధం మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles