Motkupalli Narasimhulu: సీఎం రేవంత్‌దే బాధ్యత.. కాంగ్రెస్‌లో మాదిగలకు అన్యాయం.. మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు..
పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌లో అసంతృప్తి పెరుగుతోంది. మాదిగలకు సీట్లు కేటాయించకుండా కాంగ్రెస్ అన్యాయం చేసిందంటున్నారు ఆ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు. అంతేకాదూ నిరసన తెలియజేసేందుకు రెడీ అవుతున్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్‌లో అసంతృప్తి పెరుగుతోంది. మాదిగలకు సీట్లు కేటాయించకుండా కాంగ్రెస్ అన్యాయం చేసిందంటున్నారు ఆ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు. అంతేకాదూ నిరసన తెలియజేసేందుకు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు రెండు పార్లమెంట్ సీట్లు ఇవ్వాలనే డిమాండ్‌తో గురువారం 10 గంటల నుంచి 5 గంటల వరకు తన ఇంట్లోనే దీక్ష చేయబోతున్నట్టు మోత్కుపల్లి తెలిపారు.
తనకు పార్టీ మారే ఆలోచన లేదన్న మోత్కుపల్లి.. కాంగ్రెస్‌లో మాదిగలకు అన్యాయం జరుగుతోందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మాదిగలకు రెండు టికెట్లు ఇచ్చాయని.. మరి కాంగ్రెస్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లోని చాలా మంది నేతల కుటుంబాలకు రెండు, మూడు సీట్లు ఇచ్చారని మోత్కుపల్లి కామెంట్ చేశారు.
రేవంత్ రెడ్డి సీఎం కావాలని కోరుకున్న వ్యక్తిని తానేనని.. అలాంటి తనకు సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం సరికాదని మోత్కుపల్లి అన్నారు. జరగబోయే పరిణామాలకు రేవంత్ రెడ్డిదే బాధ్యత అని కామెంట్ చేశారు. మాదిగలకు న్యాయం చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి నష్టం తప్పదని హెచ్చరించారు.
తెలంగాణలో 14 సీట్లు గెలుచుకుంటామని చెబుతున్న కాంగ్రెస్.. మాదిగలకు సీట్లు ఇవ్వలేదని జరుగుతున్న ప్రచారానికి ఏ రకంగా ఫుల్ స్టాప్ పెడుతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.
మోత్కుపల్లి నర్సింహులు వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..