Lok Sabha Election 2024: పొలిటికల్ దంగల్ షురూ..! తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం.. పూర్తి షెడ్యూల్ ఇదే..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్‌కి వేళైంది. ఈ నెల 18.. అంటే రేపే.. ఏపీలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 25 లోపు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌ వేసేందుకు అవకాశం ఉంటుంది.

Lok Sabha Election 2024: పొలిటికల్ దంగల్ షురూ..! తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం.. పూర్తి షెడ్యూల్ ఇదే..
Elections
Follow us

|

Updated on: Apr 17, 2024 | 9:52 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్‌కి వేళైంది. ఈ నెల 18.. అంటే రేపే.. ఏపీలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 25 లోపు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌ వేసేందుకు అవకాశం ఉంటుంది. పబ్లిక్ హాలిడేలు, సెలవు దినాల్లోనూ నామినేషన్లు స్వీకరిస్తారు. దీంతో నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకుంటున్నారు అభ్యర్థులు.. నామినేషన్లు వేయడానికి వచ్చే అభ్యర్థుల వాహనాలను 200 మీటర్ల దూరంలోనే అధికారులు నిలిపివేస్తారు.

అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే నామినేషన్ కేంద్రంలోకి అనుమతిస్తారు. హైదరాబాద్‌, విజయవాడలోనూ రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో నామినేషన్లకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల నేపథ్యంలో నగరంలో ప్రత్యేక నిఘా పెట్టినట్టు అధికారులు స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఇలా..

ఏప్రిల్ 18 – నామినేషన్ల స్వీకరణ

ఏప్రిల్ 25 – నామినేషన్లకు చివరి తేదీ

ఏప్రిల్ 26 – నామినేషన్ల పరిశీలన

ఏప్రిల్ 29 – నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ

మే 13 – పోలింగ్

జూన్ 4 – ఎన్నికల ఫలితాలు.

నాలుగో దశలో.. తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున.. మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సైతం మే 13న జరగనున్నాయి. నాలుగో దశలో 96 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మే 13న ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలను జూన్ 4వ తేదీన ప్రకటించనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.