AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు ఆ అధికారి ఏం చేశాడంటే..? కలెక్టర్‌పై ప్రశంసల వెల్లువ..

వినూత్న ఆలోచనలు, కార్యక్రమాలతో జిల్లా పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు ఆ జిల్లా పాలనాధికారి. పాలన విషయాల్లో ఆయన చొరవే వేరు. ఇప్పటికే ఆ అధికారి చాక్ పీస్ పట్టి పాఠాలు బోధించడమే కాకుండా పదవ తరగతి విద్యార్థుల కోసం ఇంటి తలుపు తట్టి వేకప్ కాల్ కు శ్రీకారం చుట్టారు. తాజాగా ఆ అధికారి ఓ గర్భిణీ మహిళా ఇంటి తలుపు తట్టారు ఎందుకంటే... ? తెలుసుకోవాలంటే ఈ స్టోరీపూర్తిగా చదవాల్సిందే.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు ఆ అధికారి ఏం చేశాడంటే..? కలెక్టర్‌పై ప్రశంసల వెల్లువ..
Innovative healthcare programs
M Revan Reddy
| Edited By: |

Updated on: Feb 18, 2025 | 2:33 PM

Share

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా హనుమంతరావు వచ్చిన కొద్ది రోజుల్లోనే పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఆకస్మిక తనిఖీలతో జిల్లా యంత్రాంగంలో హల్చల్ చేస్తున్నారు. విద్య, వైద్యం ద్వారానే సమాజాభివృద్ధి చెందుతుందని నమ్మిన కలెక్టర్ హనుమంతరావు విద్యా, వైద్య ఆరోగ్యశాఖలపై దృష్టిని సారించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచడమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కంటే ప్రైవేటు ఆసుపత్రుల్లోనే ప్రసవాలు ఎక్కువగా జరుగు తున్నాయి. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు విశ్వాసం కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖను పటిష్టం చేసే పనిలో పడ్డారు. తరచూ ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేస్తూ వైద్యులు సిబ్బంది పనితీరు, వైద్య సేవలను ఆయన సమీక్షిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచడమే లక్ష్యంగా శ్రీగర్భిణి ఇంటికి వెళ్లి.. తలుపు తట్టిశ్రీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు శ్రీకారం చుట్టారు. గుండాల మండలం అనంతారంలోని హైరిస్క్‌ గర్భిణి అపర్ణ ఇంటిని సందర్శించారు. కలెక్టర్‌ను వచ్చానంటూ పరిచయం చేసుకున్నారు. ఆరోగ్యం ఎలా ఉందని, వైద్య పరీక్షల చేయించుకుంటున్నారా, ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారని గర్భిణిని అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో నిపుణులైన వైద్యులు ఉన్నారని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు చేయించుకుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయని కలెక్టర్ సూచించారు. 9వేల రూపాయల విలువైన పౌష్టికాహార కిట్లను గర్భిణీ మహిళ పూర్ణిమకు ఆయన అందజేశారు. తలుపు తట్టి శ్రీ కార్యక్రమం ద్వారా మొదటి రోజు 300 మంది హైరిస్క్‌ గర్భిణుల ఇళ్లను వైద్యాధికారులు సందర్శించారు. పైసా ఖర్చు లేకుండా , ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ జరుగుతుందని, సాధారణ ప్రసవాల కోసం చివరి వరకు ప్రభుత్వ డాక్టర్లు కృషి చేస్తారని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్య సేవలపై ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. ఆ దిశగానే తలుపు తట్టి శ్రీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..